కాంగ్రెస్ ఆఫీసులో అగ్నిప్రమాదం.. ఇలాగే వదిలేస్తే, రేపు మా కార్యకర్తలను చంపినా అడిగేవారెవ్వరు : వీహెచ్

By Siva KodatiFirst Published Oct 11, 2022, 3:51 PM IST
Highlights

మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదంపై స్పందించారు మాజీ ఎంపీ వీ హనుమంతరావు. చండూరు ఘటనపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వీ హనుమంతరావు డిమాండ్ చేశారు

మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అగ్నిప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది. సరిగ్గా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సభ జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు స్పందించారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించరాదని, దీనిపై చర్యలు తీసుకోకుంటే రేపు మరొక ఘటన జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదో ఒకటి తేల్చుకునేందుకు సిద్ధంగా వున్నారని వీహెచ్ హెచ్చరించారు. రేపటి రోజున తమ కార్యకర్తలను చంపేసినా అడిగేవారెవ్వరు అంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చండూరు ఘటనపై ప్రభుత్వం, ఎన్నికల సంఘం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వీ హనుమంతరావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు. 

ALso Read:ప్రత్యర్ధుల దుశ్చర్య:చండూరులో ప్రచార సామాగ్రి దగ్దంపై రేవంత్ రెడ్డి

అంతకుముందు చండూరులోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో ప్రచారసామాగ్రి దగ్దం కావడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఉదయం చండూరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయంలో  మంటలు వ్యాపించాయి. ఎన్నికల ప్రచార సామాగ్రిని దుండగులు దగ్దం చేశారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. మునుగోడులో కాంగ్రెస్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ప్రత్యర్ధుల దుశ్చర్యకు పాల్పడ్డారని రేవంత్ ఆరోపించారు. పార్టీ ఆఫీస్ పై దాడిచేసి దిమ్మెలు కూల్చినా మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.  తమ పార్టీ కేడర్ ను బెదిరించాలని టీఆర్ఎస్, బీజేపీ కుట్రలు పన్నాయని ఆయన ఆరోపించారు. పార్టీ కార్యాలయంపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోతే ఎస్పీ  ఆఫీస్ ముందు  ధర్నా చేస్తానని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

click me!