నా జోలికి వస్తే మీ అవినీతి చిట్టాను విప్పుతా: కేసీఆర్ కుటుంబానికి కోమటిరెడ్డి వార్నింగ్

By narsimha lode  |  First Published Oct 11, 2022, 3:14 PM IST

తెలంగాణ ఉద్యమంలో  కేటీఆర్ ఎక్కడ పాల్గొన్నాడో చెప్పాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.తన జోలికి వస్తే కేసీఆర్ కుటుంబం అవినీతిని బయటపెడతానన్నారు. 


హైదరాబాద్:నా జోలికి వస్తే మీ అవినీతి చిట్టాను విప్పుతానని  భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి వార్నింగ్ ఇచ్చారు.మంగళవారం నాడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.. కల్వకుంట్ల కుటుంబమే కమీషన్ల కుటుంబం అని ఆయన ఆరోపించారు. మీ అవినీతి చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. తన జోలికి వస్తే మీ చిట్టా విప్పుతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడ ఉన్నాడని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలేశానని ఆయన గుర్తు చేశారు. 

నిజాయితీగా బతికిన తనను కోవర్ట్ అంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. 4 దఫాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా తాను నిజాయితీగా ఉన్నానని చెప్పారు. తాను, ఉత్తమ్  కుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడుతున్నట్టుగా కేటీఆర్ ప్రచారం చేశారన్నారు. ఈ ప్రచారాన్ని తాను ఖండించినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.  కేటీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నాడన్నారు.  

Latest Videos

undefined

తనకు తెలియకుండానే చండూరులో కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి  తనను దూషించారన్నారు.  అయితే మునుగోడు  నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో ఉన్నపాల్వాయి స్రవంతి తన వద్దకు ఆమెను ఆశీర్వదించి ప్రచారానికి వస్తానని చెప్పినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.  చండూరు  సభలో తనపై అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలు తనను ఇంకా బాధకు గురిచేస్తున్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 

తన ఆత్మప్రబోధం మేరకు ప్రచారానికి వెళ్లాలో వద్దా అనే ఆలోచనలో ఉన్నానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తన అభిమానులు కూడా ఇంత పెద్దమాట అన్నందుకు ప్రచారానికి ఎలా వస్తారని తనను ప్రశ్నించారన్నారు.

తాను ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలపై  పోరాటం చేసినట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. తనకు ఎక్కడాకూడా వ్యాపారాలు లేవని వెంకట్ రెడ్డి చెప్పారు. తన స్వగ్రామంలో తనకు 4 ఎకరాల భూమి ఉందన్నారు. నల్గొండలో తాను అద్దె ఇంట్లోనే ఉంటానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.  కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ మధ్య గొడవలున్నాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 

హత్య కేసులో కోర్టుల చుట్టూ తిరిగిన వ్యక్తి మంత్రి జగదీష్ రెడ్డి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. శంషాబాద్  లో మంత్రి  జగదీష్  రెడ్డికి 7 ఎకరాల ఫామ్ హౌస్ ఉందన్నారు. .బస్సు కిరాయికి లేని జగదీష్ రెడ్డకి ఇన్ని ఆస్తులు ఎక్కడి నుండి వచ్చాయని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.  ఏ వ్యాపారం చేయకుండా వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.

తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. మునుగోడులో కాంగ్రెస్  పార్టీకే ఓటేయమని చెబుతానన్నారు.  తాను విదేశాల పర్యటనకు  వెళ్లడంలేదన్నారు. తాను ఎక్కడికి వెళ్లినా ప్రజలకు చెప్పే వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. 

also read:మునుగోడు బైపోల్ 2022: కొత్త ఓటరు జాబితాను ప్రకటించొద్దంటూ బీజేపీ హైకోర్టులో పిటిషన్

తనను కోవర్ట్ అని ఆరోపించిన కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను మునుగోడులో కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తానో లేదో తమ పార్టీ అంతర్గత విషయమన్నారు.   
 


 

click me!