నియంత్రిత రద్దు.. నీ అసమర్థతే, సీఎంగా అర్హత లేదు: కేసీఆర్‌పై ఉత్తమ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 29, 2020, 2:43 PM IST
Highlights

నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రైతులను అవమానపరిచేలా ఉందన్నారు కాంగ్రెస్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రైతులను అవమానపరిచేలా ఉందన్నారు కాంగ్రెస్ నేత, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి పది లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ను ఖర్చు పెట్టారని, అందులో రైతుల నుంచి మద్ధతు ధర కింద కొనుగోలు చేయడానికి రూ.7,500 కోట్లు ఖర్చు పెట్టలేకపోయారా అని ఉత్తమ్ ప్రశ్నించారు.

రైతుల నుంచి మద్ధతు ధరకు కొనుగోలు చేసినప్పటికీ, ఆ పంటను మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడం వల్ల ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి వస్తొందని చెప్పడం దారుణమన్నారు.

వరి ధాన్యం కొనుగోలును బియ్యానికి కన్వర్ట్ చేసి , ప్రతి గింజా ఎఫ్‌సీఐ కొనుగోలు చేస్తుందని ఉత్తమ్ చెప్పారు. సమర్థులైన అధికారులు లేనట్లు .. పదవి విరమణ చేసిన వ్యక్తిని, పౌరసరఫరాల శాఖ బాధ్యతలు అప్పగించారని ఉత్తమ్ ఎద్దేవా చేశారు.

ఆయన అసమర్దత వల్ల సరిగ్గా విధులు నిర్వర్తించలేదని ఆయన చెప్పారు. రైతులతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెలగాటం ఆడుతున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. సీఎంగా కొనసాగే అర్హత కేసీఆర్‌కు లేదని ఆయన ఎద్దేవా చేశారు.

ప్రాథమిక బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటోందని.. ప్రైమరీ అగ్రికల్చరల్ కో ఆపరేటివ్ సొసైటీని ఈ ప్రభుత్వం గాలికొదిలేస్తోందని ఉత్తమ్ ఆరోపించారు. ఈ ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబానికి వ్యాపార సంస్థ అంటూ ఆయన ధ్వజమెత్తారు.

ప్రతి గ్రామంలో ఐకేపీ సెంటర్, మహిళా సంఘాల ద్వారా పంటలను కొనుగోలు చేసే ప్రక్రియను 2004లో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తుచేశారు. 

click me!