ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

Published : Dec 11, 2018, 01:42 PM IST
ఫలితాలపై అనుమానాలు ఉన్నాయి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. 


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తమకు అనుమానాలు ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.  కాగా.. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో టీఆర్ఎస్ ఆధిపత్యంలో కొనసాగుతోంది. దాదాపు టీఆర్ఎస్ విజయం ఖాయమైంది. కాగా.. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా స్పందించారు.

ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగినట్లు తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. వీవీప్యాట్ లోని స్లిప్పులను కూడా లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా కూటమి అభ్యర్థులంతా ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. వీవీ ప్యాట్ లను లెక్కించే వరకూ పట్టుపట్టాలన్నారు. ఎవరు ఓడిపోతారో.. టీఆర్ఎస్ నేతలు ముందే ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు. ఇదంతా ట్యాంపరింగ్ ను బలపరుస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!