నా ఓటమికి టీఆర్ఎస్ నేతలే కారణం: జూపల్లి

Published : Dec 11, 2018, 01:23 PM ISTUpdated : Dec 11, 2018, 01:40 PM IST
నా ఓటమికి టీఆర్ఎస్ నేతలే కారణం: జూపల్లి

సారాంశం

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తాజామాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు గట్టి షాక్ తగిలింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. 


మహబూబ్‌నగర్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తాజామాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు గట్టి షాక్ తగిలింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన జూపల్లి కృష్ణారావు ఓటమి పాలయ్యారు. 

తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డిపై దాదాపు 3వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. అయితే జూపల్లి కృష్ణారావు ఓటమిపై స్పందించారు. టీఆర్ఎస్ పార్టీ నేతలే తనకు వ్యతిరేకంగా పని చేశారని ఆయన ఆరోపించారు. 

అందువల్లే తాను ఓటమి పాలయ్యానని తెలిపారు. ఓడిపోవడం పట్ల తనకు ఎలాంటి బాధ లేదన్న ఆయన టీఆర్ఎస్ నేతలే ఓడించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు. ఇక రెస్ట్ తీసుకుంటానంటూ జూపల్లి వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం