అధిష్టానానికి ఉత్తమ్ ఫిర్యాదు.. రేవంత్‌కు రాహుల్ గాంధీ క్లాస్..!!

Published : Jun 27, 2023, 04:34 PM ISTUpdated : Jun 27, 2023, 04:38 PM IST
అధిష్టానానికి ఉత్తమ్ ఫిర్యాదు.. రేవంత్‌కు రాహుల్ గాంధీ క్లాస్..!!

సారాంశం

తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈరోజు ఢిల్లీలో జరిగిన పార్టీ స్ట్రాటజీ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈరోజు ఢిల్లీలో జరిగిన పార్టీ స్ట్రాటజీ సమావేశంలో చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో రేవంత్ వర్సెస్ ఉత్తమ్ వ్యవహరం కూడా తెరమీదకు వచ్చిందనే ప్రచారం సాగుతుంది. పార్టీలోని రేవంత్ రెడ్డి వర్గం తనకు వ్యతిరేకంగా  ప్రచారం చేస్తోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలసిందే. ఈ విషయాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెబుతూ వచ్చిన ఉత్తమ్.. సోనియా గాంధీ లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. అందులో పార్టీలో తనకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందని వివరించారు. 

ఈ లేఖ విషయంపై రాహుల్ గాందీ సమావేశంలో ప్రస్తావించినట్టుగా ప్రచారం సాగుతుంది. ఆ లేఖపై వివరణ ఇవ్వాలని రేవంత్‌ను కోరడంతో పాటుగా.. రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున అందరిని కలుపుకుని పోవాలని కూడా సూచించినట్టుగా తెలుస్తోంది. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందని తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టంగా తెలుస్తోందని రాహుల్ పేర్కొన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. పార్టీ గెలుపు కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆదేశించినట్టుగా సమాచారం. 

పార్టీ కోసం ఎవరెం చేస్తున్నారనేది తనకు తెలుసునని కూడా రాహుల్ ఈ సమావేశంలో చెప్పారు. విభేదాలు ఉంటే ఇంచార్జ్ ఠాక్రేతో  గానీ, తనతో మాట్లాడొచ్చని.. అయితే బహిరంగ వేదికలపై ఇష్టానుసారం మాట్లొద్దని ఆదేశించారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించొద్దని.. అలా చేస్తే ఉపేక్షించేది లేదని  స్పష్టం చేశారు. 

ఇదిలా ఉంటే.. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఈ రోజు తెలంగాణ  కాంగ్రెస్ స్ట్రాటజీ సమావేశం జరిగింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో దాదాపు రెండున్నర గంటలకు పైగా సమావేశం సాగింది. ఈ సమావేశంలో.. మాణిక్ రావ్ ఠాక్రే, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహా, జానారెడ్డి, సంపత్‌ కుమార్, షబ్బర్ అలీ, జగ్గారెడ్డి, వీహెచ్, సీతక్క, శ్రీధర్ బాబు, రేణుకా చౌదరి, జీవన్ రెడ్డి.. తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పార్టీ అధిష్టానం రాష్ట్ర నేతలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలో తీసుకున్న వివరాలు బయట చెప్పొద్దని జారీ చేసినట్టుగా సమాచారం. అలాగే నాయకుల మధ్య సమన్వయంపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే బయటకు వచ్చిన నేతలు.. మీడియాతో సమావేశం లోపల ఏం  జరిగిందనే వివరాలు బయటకు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఎన్నికల సంసిద్దతపై చర్చ జరిగిందని చెబుతున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్