ఇబ్రహీంపట్నం: చివరి నిమిషంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విస్ట్

Published : Dec 07, 2018, 06:36 AM IST
ఇబ్రహీంపట్నం: చివరి నిమిషంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్విస్ట్

సారాంశం

తనకు టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురైన కాంగ్రెసు నేత మల్ రెడ్డి రంగారెడ్డి బిఎస్పీ తరఫున బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 

హైదరాబాద్: ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చివరి నిమిషంలో ట్విస్ట్ ఇచ్చారు. ప్రజా ఫ్రంట్ సీట్ల పంపకంలో భాగంగా ఈ సీటును తెలుగుదేశం పార్టీకి కేటాయించారు. దాంతో టీడీపి అభ్యర్థిగా సామ రంగారెడ్డి పోటీకి దిగారు. 

అయితే, తనకు టికెట్ రాకపోవడంతో అసంతృప్తికి గురైన కాంగ్రెసు నేత మల్ రెడ్డి రంగారెడ్డి బిఎస్పీ తరఫున బరిలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నుంచి మంచిరెడ్డి కిషన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 

చివరి నిమిషంలో కాంగ్రెసు పార్టీ యూటర్న్ తీసుకుని మల్ రెడ్డి రంగారెడ్డికి మద్దతు ప్రకటించింది. బిఎఎస్పీ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డికే ఓటు వేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్రంట్ కార్యకర్తలను కోరారు. 

చివరి నిమిషంలో మల్ రెడ్డి రంగారెడ్డికే తమ మద్దతు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ప్రకటించారనేది అర్థం కావడం లేదు. అయితే, ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేయడానికి సామ రంగారెడ్డి తొలుత బెట్టు చూపించారు. తనకు ఎల్బీ నగర్ సీటు కావాలంటూ పట్టుబట్టారు. పార్టీ అధినేత చంద్రబాబుకు మొర పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. దీంతో తనకు కేటాయించిన స్థానం ఇబ్రహీంపట్నం నుంచే సామ రంగారెడ్డి పోటీకి దిగారు. 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?