మధు యాష్కీ కారు ధ్వంసం: మిర్జాపురంలో కాంగ్రెసు నేత అరెస్టు

By pratap reddyFirst Published Dec 7, 2018, 5:57 AM IST
Highlights

ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో కాంగ్రెసు నేత మధు యాష్కీ కారును ధ్వంసం చేశారు. ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా స్థానికేతరుడు ఉండడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు.

హైదరాబాద్: ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్ పల్లిలో కాంగ్రెసు నేత మధు యాష్కీ కారును ధ్వంసం చేశారు. ప్రచారం గడువు ముగిసిన తర్వాత కూడా స్థానికేతరుడు ఉండడంపై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై టీఆర్ఎస్ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 

ఇదిలావుంటే, గద్వాల శాసనసభ నియోజకవర్గంలోని మిర్జాపురంలో కాంగ్రెసు నేత రామచంద్రా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దాంతో కాంగ్రెసు నేత డికె అరుణ స్వయంగా కారు నడుపుకుంటూ పోలీసు స్టేషన్ కు వచ్చారు. పోలీసుల తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాగా, ఆందోల్ నియోజకవర్గంలో కాంగ్రెసు కార్యకర్తలు టీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు టీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారు.  

శుక్రవారం తెలంగాణలోని 119 స్థానాలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.

click me!