ఓటమి భయంతోనే మా పై దాడులు.. ఉత్తమ్

By ramya neerukondaFirst Published Dec 7, 2018, 12:14 PM IST
Highlights

ఓటమి భయం ఇప్పటికే టీఆర్ఎస్, బీజీపీ నేతలకు పట్టుకుందని ఎద్దేవా  చేశారు. ఆ ఓటమి భయంతోనే తమపై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.
 

ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి చవి చూడటం ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఓటమి భయం ఇప్పటికే టీఆర్ఎస్, బీజీపీ నేతలకు పట్టుకుందని ఎద్దేవా  చేశారు. ఆ ఓటమి భయంతోనే తమపై దాడులు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు.

కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిపై బీజేపీ కార్యకర్తల దాడిని ఉత్తమ్ ఖండించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా సాగేందుకు ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉత్తమ్ డిమాండ్ చేశారు. 

శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే.  119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. 11గంటల సమయానికి 24శాతం పోలింగ్ నమోదైంది. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

click me!