పాలేరులో 25శాతం పోలింగ్ నమోదు

By ramya neerukondaFirst Published Dec 7, 2018, 11:51 AM IST
Highlights

పాలేరు నియోజకవర్గంలో 11గంటలకు 25శాతం పోలింగ్ నమోదైంది. పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మలత నాగేశ్వరరావు, ప్రజా కూటమి అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ చురుగ్గా సాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11గంటల సమయానికి 24శాతం పోలింగ్ నమోదవ్వగా..  కేవలం ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో 11గంటలకు 25శాతం పోలింగ్ నమోదైంది. పాలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా తుమ్మలత నాగేశ్వరరావు, ప్రజా కూటమి అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇదిలా ఉండగా.. ఖమ్మం జిల్లాలో 11గంటల సమయానికి 18.5శాతం పోలింగ్ నమైదైంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 10శాతం పోలింగ్ నమోదైంది. శుక్రవారం ఉదయం ఏడుగంటలకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన సంగతి తెలిసిందే. 119 నియోజకవర్గాల్లోని 32,185 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల సిబ్బంది ఓటింగ్‌ను ప్రారంభించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ జరగనుండగా.. మిగిలిన ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది.

click me!