అకాల వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం: నష్టపోయిన తెలంగాణ రైతులు

By narsimha lode  |  First Published May 4, 2022, 11:06 AM IST


అకాల వర్షం రాష్ట్రంలోని రైతులను తీవ్రంగా నష్టపర్చింది. కొనుగోలు కేంద్రాల్లో విక్రయం కోసం తెచ్చిన ధాన్యం కూడా వర్షానికి తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


హైదరాబాద్: Telanganaరాష్ట్రంలోని బుధవారం నాడు కురిసిన వర్షం Farmers ను నట్టేట ముంచింది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దైంది. మరో వైపు ఈదురుగాలులకు మామిడి వంటి పంటలు కూడా దెబ్బతిన్నాయి.

మంగళవారం నాడు అర్ధరాత్రి నుండి బుధవారం నాడు తెల్లవారుజాము వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో Heavy Rains కురిసింది. ఉరుముములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు కూడా వీచాయి.బలమైన ఈదురు గాలులు వీయడంతో మామిడి కాయలు నేలరాలాయి. మరోవైపు కోతకు సిద్దంగా ఉన్న Paddy పైరు కూడా తీవ్రంగా దెబ్బతింది. 

Latest Videos

undefined

గత నెల 15వ తేదీ నుండి రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు చేస్తుంది. వరి ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 6 వేలకు పైగా కొనుగోలు కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తెరిచింది. 

అకాల వర్షంతో కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దైంది. మరికొన్ని చోట్ల వరి ధాన్యం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. వర్షం వస్తే వరిధాన్యంపై కప్పేందుకు టార్పాలిన్లు, ప్లాస్టిక్ కవర్లు లేక ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

ఆలస్యంగా వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంతోనే రైతులు ఇవాళ ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో భారీ వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. తడిసిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి, వెల్గటూర్ మండలంలోని రామనూర్, ఖిలావనపర్తి, నర్సింహులపల్లి, ధర్మారం, గర్రెపల్లిల్లో వరి పంట నీట మునిగింది. జగిత్యాల జిల్లాలోని సరంగపూర్ లో 64 మి.మీ వర్షపాతం నమోదైంది.ధర్మపురి, సిరికొండల్లో 61.5 మి.మీ. వెల్గటూరులో 45.8 మి.మీ, కోల్వాయి లో 40.8 మి.మీ వర్షపాతం నమోదైంది.గంగాధరలో 40.8 మి.మీ. ఎదులాపల్లిలో 31.0 మి.మీ.జమ్మికుంటలో 30.8 మి.మీ వర్షపాతం రికార్డైంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బత్తాయి, నిమ్మ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిప్పర్తి మండలం పజ్జారులో 98 మి.మీ. వర్షపాతం నమోదైంది. చింతపల్లి, పెద్దఅడిశర్లపల్లి, త్రిపురారం, తిరుమలగిరి, కట్టంగూరు, నిడమనూరులలో ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పలు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసింది.యాదాద్రి భువనగరి జిల్లాలో ఈదురు గాలులకు చెట్లు నేలకూలాయి. దీంతో ట్రాపిక్ కు అంతరాయం ఏర్పడింది.
 

click me!