
సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. ఆగంతకుడు శనివారం అర్థరాత్రి గోడ దూకి ఇంటిలోకి ప్రవేశించాడు. వెంటనే అప్రమత్తమైన కాట్రగడ్డ ప్రసూన ఆమె కుమార్తె కరణం అంబికా కృష్ణలు దుండగుడిని పట్టుకుని చితకబాదారు. ఈ ఘటనపై ప్రసూన ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి రాజకీయ కారణాలే కారణమని ఆమె ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు ప్రకాశం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు పట్టించుకోవడం లేదని ప్రసూన అంటున్నారు. తాజా ఘటన నేపథ్యంలో తమ కుటుంబానికి ప్రాణహానీ వుందని వారు భయాందోళనలు గురవుతున్నారు.