టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది: కేంద్ర మంత్రి జవదేకర్

By narsimha lodeFirst Published Nov 22, 2020, 1:31 PM IST
Highlights

టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. 

హైదరాబాద్:టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆరోపించారు. హైద్రాబాద్‌లో టీఆర్ఎస్ వైఫల్యాలపై బీజేపీ ఆదివారం నాడు చార్జీషీట్ ను విడుదల చేసింది. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చార్జీషీట్ ను బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. హైద్రాబాద్ ను  గ్లోబల్ సిటీ కాదు.. హైద్రాబాద్ ను ఫ్లడ్ సిటీ మార్చారని ఆయన విమర్శించారు. వరద కారణంగా సుమారు 15 రోజుల పాటు  ప్రజలు ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు.

హుస్సేన్ సాగర్ నీటిని కొబ్బరినీళ్లుగా చేస్తామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. హైద్రాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉందని చెప్పారు. నగరంలో వరద బాధితులకు ప్రభుత్వం ఇస్తామన్న రూ. 10 వేలు నేరుగా ఇచ్చి.. మధ్యలో డబ్బులను కొట్టేశారని  ఆయన టీఆర్ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు.

మోడీ సర్కార్ రూ. 100 చెల్లించినా లబ్దిదారుడి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ  చేసిందని ఆయన గుర్తు చేశారు.ప్రజల ఆరోగ్యం గాలికి వదిలి కరోనా టైంలో  కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారన్నారు. 

రిజిస్ట్రేషన్ అయిపోయింది. మళ్లీ ఎల్ఆర్ఎస్ ఎందుకు కట్టాలో చెప్పాలన్నారు. కుటుంబ పార్టీలు లూఠీ చేస్తున్నాయన్నారు. ఒకే కుటుంబ పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారని ఆయన చెప్పారు.

click me!