టార్గెట్ తెలంగాణ: ఏ ఒక్కరిని వదల్లేదు.. కేసీఆర్ ఫ్యామిలీపై పీయూష్ గోయల్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 18, 2020, 4:20 PM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచనల వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో కవితను ఓడించడం ద్వారా ప్రజలు టీఆర్ఎస్‌కు గట్టి సంకేతాలు పంపారని ఆయన గుర్తుచేశారు. ఇ

టీఆర్ఎస్ పార్టీపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సంచనల వ్యాఖ్యలు చేశారు. మంగళవారం హైదరాబాద్‌లో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్‌లో కవితను ఓడించడం ద్వారా ప్రజలు టీఆర్ఎస్‌కు గట్టి సంకేతాలు పంపారని ఆయన గుర్తుచేశారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ మెరుగైన ఫలితాలను సాధించిందని, తెలంగాణలో తమ పార్టీ వేగంగా బలం పుంజుకుంటోందని పీయూష్ అన్నారు. అవగాహన లోపంతోనే మంత్రి కేటీఆర్ కేంద్రంపై వ్యాఖ్యాలు చేశారని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read:కేసీఆర్ అండతోనే ఎంఐఎం రెచ్చిపోతోంది: భైంసాలో కిషన్ రెడ్డి

సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం బాధాకరమని.. ఇది రాజ్యాంగాన్ని అగౌరవపరచడమేనని గోయల్ ఆరోపించారు. పార్లమెంట్ చేసిన చట్టాలను రాష్ట్రాలు వ్యతిరేకించలేవని కపిల్ సిబాల్ కూడా చెప్పిన సంగతిని కేంద్రమంత్రి ప్రస్తావించారు.

పక్కదేశాల్లో మత హింసకు గురవుతోన్న వారికి ఆశ్రయమిస్తే తప్పేంటని పీయూష్ గోయల్ ప్రశ్నించారు. ఒవైసీ మెప్పుకోసం కేసీఆర్ మత రాజకీయాలు చేస్తున్నారని.. అందుకోసమే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటున్నారని పీయూష్ గోయల్ ఆరోపించారు. ప్రజలను అసదుద్దీన్ ఒవైసీ భయభ్రాంతుకు గురి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Also Read:కేసీఆర్ ఆలోచన: తనయ కవితకు నో, రాజ్యసభకు పొంగులేటి

మరోవైపు సరిగ్గా ఆరేళ్ల క్రితం ఇదే రోజున లోక్‌సభలో తెలంగాణ బిల్లు పాసైందని పీయూష్ గుర్తుచేశారు. కొత్త రాష్ట్రానికి కేంద్రం పూర్తి సహాయ సహాకారాలు అందిస్తోందని ఆయన తెలిపారు. గత ఐదేళ్లుగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారమే కారణమని ఆయన చెప్పుకొచ్చారు.

రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.2,602 కోట్లు కేటాయించామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విజ్ఞప్తి మేరకు చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. అలాగే తమ పార్టీ ఎంపీలు అరవింద్, సంజయ్, బాపూరావులు అడిగినవన్నీ చేస్తున్నామని పీయూష్ గోయల్ వెల్లడించారు. 

click me!