కార్వీ కన్సల్టెన్సీ కేసు: వెలుగులోకి పార్థసారథి లీలలు.. జనానికి రూ.3 వేల కోట్ల కుచ్చుటోపీ

By Siva KodatiFirst Published Aug 21, 2021, 4:26 PM IST
Highlights

పలు బ్యాంకుల నుంచి రూ.2,100 కోట్ల రుణం తీసుకుంది కార్వీ సంస్థ. వీటి ద్వారా రియాల్టీ సంస్థల్లో రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. రూ.50 కోట్లకు పైగా ఆస్తులు సైతం గుర్తించారు. కార్వీ సంస్థ  నిధుల మొత్తాన్ని రియాల్టీతో పాటు ఇన్ఫో రంగాలకు బదిలీ చేసినట్లుగా  పోలీసులు గుర్తించారు

కార్వీ కన్సల్టెన్సీలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. రూ. 3 వేల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు నిర్థారించారు. దాదాపు లక్షా 20 వేల మంది కస్టమర్లను మోసం చేసినట్లుగా గుర్తించారు. వీరిలో 80 వేల మంది కస్టమర్లకు సెబీ హామీ ఇచ్చింది. ఇప్పటికే కార్వీ ఛైర్మన్ పార్థసారథిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీసీఎస్  పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పలు బ్యాంకుల నుంచి రూ.2,100 కోట్ల రుణం తీసుకుంది కార్వీ సంస్థ. వీటి ద్వారా రియాల్టీ సంస్థల్లో రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. రూ.50 కోట్లకు పైగా ఆస్తులు సైతం గుర్తించారు. కార్వీ సంస్థ  నిధుల మొత్తాన్ని రియాల్టీతో పాటు ఇన్ఫో రంగాలకు బదిలీ చేసినట్లుగా  పోలీసులు గుర్తించారు. రెండు సంస్థల్లో భారీ నష్టాలను చూపించారు పార్థసారథి. హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు పార్థసారథి. సీసీఎస్‌లో ఇప్పటికే పార్థసారథిపై మూడు కేసులు నమోదయ్యాయి. అటు సైబరాబాద్‌లో పార్థసారథిపై ఐసీఐసీఐ బ్యాంక్ ఫిర్యాదు చేసింది. 

click me!