పార్టీ ఫిరాయింపులకు గ్రేట్ మాస్టర్ : కేసీఆర్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్

By narsimha lode  |  First Published Oct 28, 2022, 12:07 PM IST

తెలంగాణలో పార్టీ పిరాయింపులకు కేసీఆరే  ఆద్యుడని కేంద్ర  మంత్రి  కిషన్  రెడ్డి  చెప్పారు.   నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో  బేరసారాలు జరిపారనే అంశంలో తమ  పార్టీకి సంబంధం లేదని  ఆయన స్పష్టం  చేశారు.


హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులకు గ్రేట్ మాస్టర్  కేసీఆర్  అని కేంద్ర  మంత్రి కిషన్  రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర  మంత్రి  కిషన్ రెడ్డి  శుక్రవారంనాడు న్యూఢిల్లీలో  మీడియాతో మాట్లాడారు.  నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు గురి  చేసి   పార్టీలో  చేర్చుకొంటున్నామని  తమపై తప్పుడు ప్రచారం  చేశారని కేసీఆర్  పై కిషన్  రెడ్డి మండిపడ్డారు.  

అంతేకాదు రాష్ట్ర  ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నామని కూడ  ప్రచారం  చేశారని  ఆయన  మండిపడ్డారు. తమ  పార్టీలో  చేర్చుకొనేందుకు  చేరికల కమిటీని కూడ  ఏర్పాటు  చేసుకున్న  విషయాన్ని  కిషన్ రెడ్డి గుర్తు  చేశారు. తమ  పార్టీలో చేరాలనుకునేవారితో ఈ కమిటీ  సంప్రదింపులు జరుపుతుందన్నారు. చాటుమాటుగా  డబ్బులిచ్చి  తమపార్టీలో చేర్చుకొనే పరిస్థితులు లేవన్నారు. ఈటల  రాజేందర్ ,కోమటిరెడ్డి   రాజగోపాల్  రెడ్డిలు  తమ  ఎమ్మెల్యే  పదవులకు,పార్టీ పదవులకు   రాజీనామాలు  చేసి  బీజేపీలో  చేరిన  విషయాన్ని  కేంద్ర మంత్రి ప్రస్తావించారు..  నలుగురు  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  కొనుగోలు  చేసేందుకు  తాము ప్రయత్నించామని దుష్ప్రచారం చేశారన్నారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన  12 మంది  ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ లో  విలీనం  చేసుకున్న విషయాన్ని  కిషన్  రెడ్డి  చెప్పారు.

Latest Videos

undefined

నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల   కొనుగోలు  కోసం ముందు  వంద కోట్లు,ఆ  తర్వాత  రూ.15 కోట్లు  ఇచ్చేందుకు  ప్రయత్నించారన్నారు. కానీ ఈ డబ్బులు  ఏమయ్యాయని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. 

బీజేపీలో ఎవరైనా  చేరొచ్చన్నారు. కానీ ఇతర పార్టీల ద్వారా  సంక్రమించిన పదవులకు  రాజీనామాలు  చేయాలన్నారు. అప్పుడే తమ పార్టీలో చేర్చుకొంటామన్నారు.ఆ నలుగురు  టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ  పార్టీలో వస్తే  ఏంటీ, రాకపోతే ఏమిటని  ఆయన  ప్రశ్నించారు. ఆ  నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీలో  చేర్చుకొంటే  కేసీఆర్ సర్కార్ కూలిపోతుందా  అని  కిషన్  రెడ్డి  ప్రశ్నించారు. పార్టీలను గంపగుత్తగా   టీఆర్ఎస్  లో కలుపుకుంది  ఎవరని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  అడిగారు..పార్టీ పిరాయింపులు ఇవాళ కొత్తేం  కాదన్నారు. స్వాతంత్ర్యం  వచ్చిన నాటి  నుండి దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఒక్క పార్టీ నుండి మరో పార్టీలో  చేరిన ఘటనలు అనేకం  ఉన్నాయని  ఆయన వివరించారు.

.మునుగోడులో ఓడిపోవడం ఖాయమని  అన్ని  సర్వేలు తేల్చి  చెప్పడంతో టీఆర్ఎస్ ఈ ప్లాన్ చేసిందని కిషన్ రెడ్డి   విమర్శించారు.. వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ  ఎన్నికల్లో  కేసీఆర్ పాలనకు  చరమ గీతం పాడుతామని కిషన్ రెడ్డి  ధీమాను వ్యక్తం  చేశారు.  కేసీఆర్  ఢిల్లీకి వచ్చినా మీడియా  సమావేశం  పెట్టిన తమకు నష్టం లేదన్నారు.

మొయినాబాద్  ఫాం హౌస్ లో  ఎమ్మెల్యేల ప్రలోభాలకు గురి చేశారనే  అంశంలో తమ పార్టీ ప్రమేయం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి  స్పష్టం  చేశారు.ఈ విషయమై సిట్టింగ్ జడ్జి  లేదా  న్యాయమూర్తి పర్యవేక్షణలో సీబీఐ  విచారణ జరిపించాలని  ఆయన  డిమాండ్  చేశారు.ఈ విషయమై తాము న్యాయస్థానాన్ని  ఆశ్రయించినట్టుగా కిషన్ రెడ్డి చెప్పారు.

also  read:కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్: యాదాద్రికి బయలుదేరిన బీజేపీ తెలంగాణ చీఫ్

వారం రోజుల క్రితం తెలంగాణ మంత్రి  కేటీఆర్ మునుగోడులో తమ  పార్టీకి  చెందిన  నేతతో  మాట్లాడినట్టుగా  కేంద్ర  మంత్రి  కిషన్ రెడ్డి  చెప్పారు. తెలంగాణ  ప్రభుత్వంపై  తమకు నమ్మకం లేదన్నారు. తెలంగాణ పోలీసులపై తమకు నమ్మకం ఉందన్నారు. అందుకే  సీబీఐ  విచారణ కోరుతున్నామని కిషన్  రెడ్డి  చెప్పారు.

click me!