ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో ముగ్గురి అరెస్ట్ రిజెక్ట్:హైకోర్టులో పోలీసుల లంచ్ మోషన్ పిటిషన్

By narsimha lode  |  First Published Oct 28, 2022, 11:58 AM IST

మొయినాబాద్ పాంహౌస్  లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను  ప్రలోభ పెట్టారనే అంశంపై  ముగ్గురు  నిందితుల అరెస్ట్  రిజెక్టుపై  హైకోర్టులో  సైబరాబాద్ పోలీసులు  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు  చేశారు.


హైదరాబాద్: మొయినాబాద్ ఫాం హౌస్ లో ఎమ్మెల్యేలకు ప్రలోభాల అంశంలో ఆరోపణలు  ఎదుర్కొంటున్న ముగ్గురు  నిందితుల  అరెస్ట్ ను  రిజెక్ట్  చేయడంపై సైబరాబాద్  పోలీసులు  శుక్రవారం నాడు హైకోర్టులో లంచ్  మోషన్  పిటిషన్ దాఖలు చేశారు.ముగ్గురు   నిందితులను  కస్టడీకి ఇచ్చేలా ఆదేశాలు  ఇవ్వాలని  ఆ  పిటిషన్ లో కోరారు .

మొయినాబాద్ ఫాం హౌస్  లో టీఆర్ఎస్ కు  చెందిన నలుగురు  ఎమ్మెల్యేలను  ప్రలోభాలకు  గురి  చేశారనే ఆరోపణలపై ముగ్గురిని పోలీసులు ఈ నెల 26న అరెస్ట్ చేశారు. ఈ మేరకుతాండూరు  ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి  పోలీసులకు పిర్యాదు చేశారు.ఈ పిర్యాదు మేరకు పోలీసులు  ఢిల్లీకి చెందిన రామచంద్రభారతి, తిరుపతికి చెందిన సింహయాజీ, హైద్రాబాద్ కు  చెందిన నందులను అరెస్ట్  చేశారు.

Latest Videos

 నిన్న రాత్రి ఈ  ముగ్గురిని  పోలీసులు సరూర్  నగర్ లో  ఉన్న  జడ్జి  నివాసంలో హాజరుపర్చారు.  అయితే  ఈ ముగ్గురిపై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేయడాన్ని జడ్జి  తప్పు బట్టారు.పీడీ  యాక్ట్ వర్తించదని  జడ్జి తేల్చి  చెప్పారు. 41  సీఆర్‌పీసీ సెక్షన్ కింద  నోటీసులు ఇచ్చి విచారించాలని జడ్జి ఆదేశించారు. ఈ ఆదేశాల  మేరకు పోలీసులు  ఈ ముగ్గురికి  41  సీఆర్‌పీసీ సెక్షన్  కింద  నోటీసులు  జారీ చేశారు. ఇవాళ  విచారణకు రావాలని ఆదేశించారు.నిందితులను వదిలేయాలని కోరారు.అయితే ఈ విషయమై సైబరాబాద్ పోలీసులు ఇవాళ లంచ్ మోషన్ పిటిషన్  దాఖలు చేశారు. నిందితుల  అరెస్ట్  ను జడ్జి  తిరస్కరించడాన్ని  సవాల్  చేశారు.

ఈ నెల 26న మొయినాబాద్  ఫాం హౌస్ లో  నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి  చేశారని   ఈ ముగ్గురిపై  ఆరోపణలు వచ్చాయి. తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్  రెడ్డి ఇదే విషయమై మొయినాబాద్  పోలీసులకు పిర్యాదు  చేశాడు. పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో  రోహిత్  రెడ్డి  కీలక అంశాలను ప్రస్తావించారు. 

also read:కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్: యాదాద్రికి బయలుదేరిన బీజేపీ తెలంగాణ చీఫ్

తమ పార్టీ  ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందని టీఆర్ఎస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను బీజేపీ తప్పుబట్టింది. ఈ నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలు  పెట్టాల్సిన  అవసరం లేదని  బీజేపీ  ప్రకటించింది. కేసీఆర్ సర్కార్  ను  కూల్చివేయాల్సిన  అవసరం  కూడ తమకు  లేదని  కూడ  బీజేపీ  తేల్చి  చెప్పింది.  ఈ విషయమై  ఎవరూ కూడ   నోరు మెదపవద్దని  టీఆర్ఎస్  నేతలను కోరారు ఆ పార్టీ  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్ . ట్విట్టర్  వేదికగా  ఈ విషయాన్ని  కేటీఆర్ నిన్న  ప్రకటించిన విషయం  తెలిసిందే.
 

click me!