తెలంగాణకు నిజాం నగలు తెస్తాం.. కానీ : కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Feb 15, 2022, 08:50 PM IST
తెలంగాణకు నిజాం నగలు తెస్తాం.. కానీ : కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

నిజాం నగలు (nizam ornaments) తెలంగాణకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) .  నిజాం నగల కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సెక్యూరిటితో కూడిన ఒక భవనం ఏర్పాటు చేస్తే తాము ముందుకొస్తామన్నారు. 

నిజాం నగలు (nizam ornaments) తెలంగాణకి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) . భారతదేశంలోని మ్యూజియంలను రీఇమేజింగ్ చేయడంపై  కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ మంగళవారం సమావేశం ఏర్పాటు చేసింది. ఈ గ్లోబల్ సమ్మిట్‌ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. రెండు రోజులపాటు ఆన్‌లైన్‌ ద్వారా జరిగే ఈ సమ్మిట్ లో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, యూ.ఏ.ఈ., యూ.కే., అమెరికా, భారత్ తదితర  దేశాలకు చెందిన మూడువేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..  నిజాం నగల కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సెక్యూరిటితో కూడిన ఒక భవనం ఏర్పాటు చేస్తే తాము ముందుకొస్తామన్నారు. హైదరాబాద్‌‌లో సైన్స్ సిటీ ఏర్పాటు చేయదానికి కేంద్రం ముందుకొచ్చిందని కిషన్ రెడ్డి తెలిపారు.  దీనికి 25 ఎకరాలు స్థలం అవసరం ఉందన్నారు. ల్యాండ్ కేటాయించాలని సీఎం కేసీఆర్‌కి లేఖ రాశామని.. కానీ దీనికి ఇంకా సమాధానం  లేదన్నారు. తెలంగాణలో కొమరం భీమ్, ఆంధ్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు పేరుతో ట్రైబల్ మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  కొమరం భీమ్ కోసం 18 కోట్లు, అల్లూరి సీతారామరాజు కోసం 35 కోట్ల రూపాయల్ని కేటాయించామని ఆయన తెలిపారు.

అంతకుముందు కేసీఆర్ (kcr) ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్ద‌మంటూ కిష‌న్ రెడ్డి వెల్ల‌డించారు. గత ఏడేండ్ల పాల‌న‌లో మోడీ (narendra modi) ప్రభుత్వం చేసిందేమీ లేదన్న కేసీఆర్ ఆరోపణపై మంత్రి కిష‌న్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఈ కాలంలో ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించిందని, ఈ విషయాన్ని చర్చలో నిరూపించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

అలాగే, ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం కేసీఆర్‌ అభ్యంతరకర పదజాలంతో దూషిస్తున్నార‌నీ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అధినేత నిరాశతో ప్రధానిపై విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. కేసీఆర్ వాడుతున్న భాష ముఖ్యమంత్రికి తగదని అన్నారు. బీజేపీని దేశం నుంచి తరిమికొడతామని కేసీఆర్ చెప్పడంపై.. భూమ్మీద ఏ శక్తీ దీన్ని చేయలేదని బీజేపీ  కిష‌న్ రెడ్డి అన్నారు. రేపు అధికారం కోల్పోయినా బీజేపీ బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతుందని తెలిపారు. 

2016లో ఉరీ ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ రుజువు కావాలంటూ కేసీఆర్ చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు దేశ భద్రత, సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని కిషన్ రెడ్డి అన్నారు. "అతను అమరవీరులను అవమానించాడు, మన ధైర్య సైన్యాన్ని నిరుత్సాహపరిచాడు. అత్యున్నత త్యాగం చేసిన వారి కుటుంబాల మనోభావాలను దెబ్బతీశాడు" అని కిష‌న్ రెడ్డి విమ‌ర్శించారు. కేసీఆర్ ఉప‌యోగిస్తున్న భాష‌ను పాకిస్థాన్ కూడా ఉప‌యోగించ‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్