వ్యవసాయ మీటర్లు, విద్యుత్ కొనుగోలు రాష్ట్రాల ఇష్టం ... ఆయనవన్నీ అబద్ధాలే : కేసీఆర్‌కు కేంద్రం కౌంటర్

Siva Kodati |  
Published : Feb 15, 2022, 07:08 PM ISTUpdated : Feb 15, 2022, 07:11 PM IST
వ్యవసాయ మీటర్లు, విద్యుత్ కొనుగోలు రాష్ట్రాల ఇష్టం ... ఆయనవన్నీ అబద్ధాలే : కేసీఆర్‌కు కేంద్రం కౌంటర్

సారాంశం

విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ మీటర్లకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) చేసిన  వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని.. పునరుత్పాదక విద్యుత్‌ను కొనాలని ఒత్తిడి చేయడం లేదని కేంద్రం పేర్కొంది. పలానా వారి దగ్గరే కొనాలనే తాము చెప్పలేదని.. ఎవరి నుంచైనా కొనే స్వేచ్ఛ వుందని తెలిపింది. 

విద్యుత్ సంస్కరణలు, వ్యవసాయ మీటర్లకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) చేసిన  వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. వ్యవసాయ మోటార్లకు తాము ఒత్తిడి చేస్తున్నామన్నది తప్పుడు ప్రచారమని కేంద్రం ఆరోపించింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి చేయడం లేదని స్పష్టం చేసింది. కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని.. పునరుత్పాదక విద్యుత్‌ను కొనాలని ఒత్తిడి చేయడం లేదని కేంద్రం పేర్కొంది. పలానా వారి దగ్గరే కొనాలనే తాము చెప్పలేదని.. ఎవరి నుంచైనా కొనే స్వేచ్ఛ వుందని తెలిపింది. హైడ్రో పవర్ గురించి కూడా కేసీఆర్ మాట్లాడారని.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్ట్‌లకు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రూ.55 వేల కోట్లు అప్పు ఇచ్చాయని దీనికి కేసీఆర్ రుణపడి వుండాలని కేంద్రం పేర్కొంది. సీఎం పదవిలో వుండి కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

కాగా.. ప్రధాని నరేంద్ర మోడీపై (narendra modi) మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr). ఆదివారం ప్రగతి భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మోడీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటన్నారు. మోడీ అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. మోడీ వల్ల దేశం ఎంత నాశనమవుతుందో వివరిస్తూ ఎంతోమంది పుస్తకాలు రాస్తున్నారని కేసీఆర్ దుయ్యబట్టారు. విద్యుత్ సంస్కరణలపైనా అబద్ధాలే చెబుతున్నారని సీఎం ఆరోపించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారని కేసీఆర్ దుయ్యబట్టారు. 

మోడీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని... పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే బిల్లును అమలు చేస్తున్నారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఏపీలో ఇప్పటికే కొన్ని వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టారని.. మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం ఎఫ్ఆర్‌బీఎం అదనంగా ఇస్తామంటున్నారని కేసీఆర్ తెలిపారు. మీటర్లు పెట్టమనకుండానే జగన్‌మోహన్ రెడ్డి (ys jagan) పెట్టారా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణలో విద్యుత్ సంస్కరణలు అమలు చేయట్లేదని వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఇవేమీ తెలియదని.. రాష్ట్రానికి 25 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా, తాను మీటర్లు పెట్టలేదని సీఎం వెల్లడించారు. 

మిషన్ భగీరథ ప్రారంభ సభలోనూ మోడీ అబద్ధాలే చెప్పారంటూ కేసీఆర్ దుయ్యబట్టారు. తెలంగాణకు యూనిట్ రూ.1.10కే ఇస్తున్నట్లు మోడీ చెప్పారని.. నా పక్కనే నిలబడి మోడీ అబద్ధం చెబుతున్నా మర్యాద కోసం తాను మాట్లాడలేకపోయానని కేసీఆర్ గుర్తుచేశారు. అసలు ఎప్పుడైనా తెలంగాణకు యూనిట్ రూ.1.10కే విద్యుత్ ఇచ్చారా అని మోడీ సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. 40 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌ల నిర్మాణం పూర్తయినా కరెంట్ ఉత్పత్తి చేయనివ్వడం లేదని.. కేంద్ర ప్రభుత్వ తప్పుడు విద్యుత్ విధానం వల్లే ఈ పరిస్ధితి వచ్చిందని కేసీఆర్ ఆరోపించారు. 

మాకు అర్ధమయ్యే మీ రంగు బయటపెట్టామని, 40 కోట్లమంది దళితులకు 12 వేల కోట్లు కేటాయించింది నిజం కాదా అని సీఎం ప్రశ్నించారు. అన్నీ అమ్మేస్తున్నారని.. ఇప్పుడు విద్యుత్ అమ్మడానికి సిద్ధమయ్యారని కేసీఆర్ ఆరోపించారు. డిస్కమ్‌లను ప్రైవేట్‌పరం చేయాలనుకోవడం చాలా దారుణమన్నారు. విద్యుత్ ప్రైవేట్‌పరమైతే ఇబ్బడిముబ్బడిగా ఛార్జీలు పెరిగి జనం చస్తారని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్