గురువారం రాత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ మీద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ , టీఆర్ఎస్ లకు ప్రజల్లో ఆదరణ తగ్గినందుకే ఇలా మాట్లాడారని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్ : గురువారం రాత్రి సీఎం కేసీఆర్ పెట్టిన ప్రెస్ మీట్ మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కల్వకుంట్ల కుటుంబానికి, టిఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ తగ్గుతోందని కిషన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ తీవ్ర అసహనంతో ప్రెస్ మీట్ కు వచ్చి, చెప్పిందే పదేపదే చెప్పారని అన్నారు. అమిత్ షా, నడ్డా, సంతోష్ లపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. వీడియోలో ఉన్నవారితో మా పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కిరాయి ఆర్టిస్టులతో, పార్టీ నేతలతో కెసిఆర్ అందమైన అబద్ధం సృష్టించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది కేసీఆరే అని విమర్శించారు. దేశంలో ప్రజాస్వామ్యం ఆవేదన వ్యక్తం చేయడం హాస్యాస్పదం అన్నారు.
ఇదిలా ఉండగా, గురువారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడారు.. దేశంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. తాను చాలా బాధతో మాట్లాడుతున్నానని.. ఎనిమిదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన బిజెపి దేశాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టింని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడులో సిగ్గుపడే పరిస్థితి ఉందని.. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తనను కలిసినట్టుగా దుష్ప్రచారం చేశారని కేసీఆర్ మండిపడ్డారు. హుజురాబాద్, దుబ్బాకలో టిఆర్ఎస్ ఓడిందని.. సాగర్, హుజూర్ నగర్ లో తాము గెలిచామని ఆయన గుర్తు చేశారు.
undefined
ఏపీ సర్కార్‌ను కూల్చేందుకు బీజేపీ కుట్ర.. బాంబుపేల్చిన కేసీఆర్, జగన్‌కు అలర్ట్
మునుగోడు పోలింగ్ ముగిసిన వెంటనే ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. రాజకీయాల్లో సంమయమనం అనవసరమని కేసీఆర్ హితవు పలికారు. ఎన్నికల కమిషన్ విఫలమైందనే విమర్శలు చేస్తున్నారని.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విఫలమయ్యారని విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. వాళ్లకు అనుకూలంగా పని చేయాలా అని కేసీఆర్ ప్రశ్నించారు.
టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు విషయంలో ఆయన ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియోలను రిలీజ్ చేస్తున్నానని చెప్పారు. దేశంలోని అన్ని పత్రికా సంస్థలకు కూడా ఈ వీడియోలు పంపానని.. ఎదురులేని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టి ప్రజాగ్రహానికి గురయ్యారని.. ఈ సందర్భంగా గుర్తు చేశారు. అని రాష్ట్రాల సీఎంలకు, పార్టీల అధ్యక్షులకు ఈ వీడియోలు పంపుతానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ హైకోర్టుకు ఫాం హౌస్ ఫైల్స్ ఇప్పటికే పంపించానని దేశంలోని అన్ని హైకోర్టులకు, సుప్రీంకోర్టుకు ఈ వీడియోలు పంపుతామని సీఎం తెలిపారు. బెంగాల్ వెళ్లి ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని స్వయంగా ప్రధానే చెప్పారని.. ఏక్నాథ్ షిండే లాంటి వాళ్ళని సృష్టిస్తారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్ నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నామని వీడియోలో వాళ్ళు చెప్పినట్టు చెప్పుకొచ్చారు.