
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గవర్నర్ తమిళిసై సమావేశం కానున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెలువడిన మరుసటి రోజే గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కాగా, గవర్నర్ తమిళిసై ఢిల్లీ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.