టీడీపీపీ విలీనం రాజ్యాంగబద్దంగానే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Jun 23, 2019, 5:24 PM IST
Highlights

రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీం చేయడం  రాజ్యాంగం ప్రకారంగానే జరిగిందని  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆదివారం నాడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

హైదరాబాద్: రాజ్యసభలో టీడీపీపీని బీజేపీలో విలీం చేయడం  రాజ్యాంగం ప్రకారంగానే జరిగిందని  కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆదివారం నాడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.

ఈ మేరకు తీర్మాన ప్రతులను తమకు అందించాకే వారిని బీజేపీలో చేర్చుకొన్నామన్నారు. టీడీపీ నేతల చేరికను అమిత్ షా అంగీకరించినట్టుగా చెప్పారు.  టీడీపీ ఎంపీలు చట్టబద్దంగా విలీనమయ్యారన్నారు.ఈ విషయం తెలియకుండా కొందరు  విమర్శిస్తున్నారని రాజ్యసభలో గతంలో ఇలాంటి విలీనాలు 16 సార్లు జరిగాయన్నారు.

టీడీపీ ఎంపీలపై అనర్హత వేటు వేసే అవకాశమే లేదన్నారు. రాజ్యాంగంలోని 10వ, షెడ్యూల్‌ ప్రకారమే విలీనం జరిగిందన్నారు. అన్ని నిబంధనలు చూసిన తర్వాతే  రాజ్యసభ ఛైర్మెన్  నిర్ణయం తీసుకొన్నారన్నారు. నిబంధనలను అనుసరించి వేరే పార్టీలో చేరతామంటే ఆపే అధికారం ఎవరికీ లేదని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

click me!