కేంద్ర కేబినెట్ ఎజెండాలో తెలంగాణ అంశాలు: హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి

Published : Oct 04, 2023, 10:27 AM ISTUpdated : Oct 04, 2023, 10:34 AM IST
కేంద్ర కేబినెట్ ఎజెండాలో తెలంగాణ అంశాలు: హుటాహుటిన ఢిల్లీకి కిషన్ రెడ్డి

సారాంశం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారం నాడు న్యూఢిల్లీకి వెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు.  


హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బుధవారంనాడు న్యూఢిల్లీకి వెళ్లారు.  మంగళవారంనాడు రాత్రి ఢిల్లీ నుండి ఫోన్ రావడంతో  కిషన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లినట్టుగా సమాచారం.ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన అంశాలున్నాయి. పసుపు బోర్డు ఏర్పాటు, ములుగులో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటుకు  కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది.ఈ విషయమై  కిషన్ రెడ్డిని  న్యూఢిల్లీకి రావాలని కోరినట్టుగా సమాచారం. దీంతో కిషన్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్లారని  పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కేబినెట్ సమావేశం తర్వాత  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో  కిషన్ రెడ్డి భేటీ కానున్నారని సమాచారం.ఈ నెల 2వ తేదీన కూడ  కిషన్ రెడ్డి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నెల 3న నిజామాబాద్ లో జరిగిన ఇందూరు ప్రజా గర్జన సభలో   ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ పై బాంబు పేల్చారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత  బీఆర్ఎస్  ఎన్‌డీఏలో చేరుతానని  తనతో చెప్పారని మోడీ పేర్కొన్నారు. ప్రధాని మోడీ  వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది.ఈ విషయమై  తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ప్రధాని మోడీ తన స్థాయిని మరిచిపోయి అబద్దాలు చెప్పారని కేటీఆర్ విమర్శించారు.

త్వరలోనే తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో సీఈసీ నేతృత్వంలోని బృందం పర్యటిస్తుంది.  ఈ నెల 6వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ తరుణంలోనే  ఈ నెల 1వ తేదీన  ప్రధాని తెలంగాణకు ఇచ్చిన వరాలకు సంబంధించి  కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  పసుపు బోర్డు అంశం గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కీలకంగా పనిచేసింది. పసుపు బోర్డును ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని  బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్  హామీ పత్రం కూడ రాసిచ్చిన విషయం తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu
Entrance Exams : పదో తరగతి తర్వాత ఫ్రీగా ఇంటర్ చదవాలా..? అయితే తప్పక రాయాల్సిన ప్రవేశ పరీక్షలివే