రామగుండం ఫ్యాక్టరీని ఓపెన్ కానివ్వలేదు.. యూరియా కొరత వస్తే మీదే బాధ్యత : కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్

Siva Kodati |  
Published : May 31, 2022, 04:55 PM IST
రామగుండం ఫ్యాక్టరీని ఓపెన్ కానివ్వలేదు.. యూరియా కొరత వస్తే మీదే బాధ్యత : కేసీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్

సారాంశం

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని కేసీఆర్ సర్కార్ ప్రారంభం కాకుండా అడ్డుకుంటోందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని మోడీ వచ్చి ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తే.. తమ కుటుంబానికి నష్టమనే ఆలోచనతోనే సీఎం వున్నారని ఆయన దుయ్యబట్టారు.   

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని (ramagundam urea plant) ప్రధాని మోడీ (narendra modi) ప్రారంభించకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) . కాలుష్యం పేరుతో నోటీసులు ఇచ్చారని ఆయన విమర్శించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానిదేనని కిషన్ రెడ్డి హెచ్చరించారు. టీఆర్ఎస్ సర్కార్ (trs) తీరు దుర్మార్గమని.. దీనిపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. మోడీ వచ్చి ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభిస్తే.. తమ కుటుంబానికి నష్టమనే ఆలోచనతోనే కేసీఆర్ (kcr) ఇలా చేశారని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

ఇకపోతే.. ఎంఐఎం (aimim) అధినేత‌, హైద‌రాబాద్ పార్ల‌మెంట్ స‌భ్యులు అస‌దుద్దీన్ ఒవైసీపై నిన్న కిష‌న్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ)కి గానీ, ప్ర‌భుత్వాన్ని గానీ ఎంఐఎం నుంచి ఎలాంటి స‌ర్టిఫికేట్ అస‌వ‌రంలేదంటూ మండిప‌డ్డారు. మ‌హారాష్ట్రలో ఓ ర్యాలీ సంద‌ర్భంగా ఒవైసీ (Asaduddin Owaisi) చేసిన వ్యాఖ్య‌ల‌కు కిష‌న్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. “ఒవైసీ నాయకత్వంలో అనేక మంది హిందువులు తమ నివాసాలను విడిచిపెట్టవలసి వచ్చింది. మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల గూండాయిజం కారణంగా చాలా మంది దళితులు కూడా ఇళ్లు వదిలి వెళ్లాల్సి వచ్చింది. మజ్లిస్ పార్టీ సర్టిఫికేట్ మాకు లేదా మా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం లేదు”అని కిష‌న్ రెడ్డి అన్నారు. 

Also Read:Kishan Reddy: పార్టీకి గానీ.. ప్ర‌భుత్వానికి గానీ ఎంఐఎం స‌ర్టిఫికేట్ అవ‌స‌రం లే.. : కిష‌న్ రెడ్డి

అంత‌కుముందు హైద‌రాబాద్ లోని బీజేపీ కార్యాల‌యంలో కిష‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..దేశంలో అవినీతి లేకుండా కేంద్ర ప్రభుత్వం పాలన సాగుతుందన్నారు.  ఒక్క రూపాయి కూడా దర్వినియోగం కాకుండా కేంద్రం పాలన సాగిస్తుందని కిషన్ రెడ్డి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి 58 శాతం పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశంలో మౌళిక వసతులు, రక్షణ అవసరాలకు వినియోగిస్తున్నట్టుగా కిషన్ రెడ్డి వివరించారు.

ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయడం లేదని  తేల్చి చెప్పారు. దేశంలో ఎయిర్ పోర్టులు, జల మార్గాలు, రైల్వేలు, రోడ్ల నిర్మానం చేపట్టినట్టుా  కిసన్ రెడ్డి తెలిపారు. Petrol, డీజీల్ ధరలపై పన్నులను కేంద్ర ప్రభుత్వం  రెండు సార్లు తగ్గించిందని ఆయన చెప్పారు. దీంతో రూ. 2 లక్షల 20 వేల కోట్లు కేంద్రం ఆదాయం కోల్పోయిందని  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వివరించారు.భారతదేశం తలుచుకొంటే ఏమైనా చేస్తుందని నిరూపించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. రక్షణ రంగంలో కూడా దేశీయ ఉత్పత్తులను పెంచుకొన్నట్టుగా చెప్పారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu