తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. సినిమా టికెట్ ఓ చిన్నారి ప్రాణాలు తీసింది. భీమ్లా నాయక్ సినిమా టికెట్ కోసం డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో పదకొండేళ్ల విద్యార్థి ఉరివేసుకుని చనిపోయాడు.
జగిత్యాల : jagtial జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సినిమా టికెట్ కు డబ్బులు ఇవ్వలేదని ఓ స్కూల్ విద్యార్థి suicide చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నవదీప్ (11) అనే బాలుడు 8వ తరగతి చదువుతున్నాడు. Bhimla Nayak సినిమా కోసం తన మిత్రులు ముందుగానే tickets Bookచేసుకుంటున్నారని తనకి కూడా రూ.300 కావాలని తండ్రిని నవదీప్ అడిగాడు. అందుకు తండ్రి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన నవదీప్ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. విద్యార్థి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 2న ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి గూడెంలో ఇలాగే ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. Mechanical Engineering విద్యార్థి suicide పశ్చిమగోదావరి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని Thadepalligudem మండలం పెదతాడేపల్లిలో గల ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో గతనెల 18న అల్లంశెట్టి రవితేజ (19) మెకానికల్ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాడు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెనికి చెందిన రవితేజ టెక్కలిలో డిప్లమా పూర్తిచేశాడు.
undefined
ఇటీవల సంక్రాంతి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లిన రవితేజ వారం రోజుల క్రితం కళాశాలకు వచ్చాడు. అప్పటి నుంచి ఎలాంటి pain లేకుండా చనిపోవడం ఎలా అంటూ తోటి విద్యార్థులతో చర్చించాడు. సోమవారం ఉదయం నలతగా ఉండడంతో తల్లి అనుమతి మేరకు కళాశాల హాస్టల్ లోనే ఉండి పోయాడు. అదే రూమ్ లో ఉంటున్న నితిన్, వీరాస్వామి తమ రోజువారి తరగతులకు హాజరయ్యారు.
మధ్యాహ్నం 11.50 గంటల ప్రాంతంలో సహచరమిత్రుడు వీరాస్వామితో పాటు మరో నలుగురు సెల్ఫోన్లకు ‘మీకు సర్ ప్రైజ్ ఇస్తున్నా.. నేను చనిపోవాలనుకుంటున్నా..’ అంటూ Text messageను రవితేజ పోస్ట్ చేశాడు. దీంతో వీరాస్వామి అతని తల్లికి ఫోన్ చేసి మాట్లాడగా, సెలవు పెట్టి రూమ్ లోనే ఉన్నాడు అని చెప్పారు. వెంటనే మిగతా విద్యార్థులు, సీనియర్లతో కలిసి రవితేజ ఉన్న రూమ్ వద్దకు వెళ్లి చూశారు.
రెండు వైపులా తలుపులు వేసి ఉండడంతో విద్యార్థులు రూమ్ తలుపులు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే ఫ్యాన్ కు నైలాన్ తాడుతో ఉరి వేసుకుని వేలాడుతున్న రవితేజను సహచర విద్యార్థులు, సిబ్బంది సహకారంతో తాడేపల్లిగూడెంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి రవితేజ అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం రూరల్ సిఐ వి.రవికుమార్, ఎస్ఐ ఎం శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై తోటి విద్యార్థులు స్పందిస్తూ బాధ లేకుండా చనిపోవడం ఎలా అని చర్చిస్తే తాము సాధారణంగా తీసుకున్నామని, ఇలా ప్రాణాలు తీసుకుంటాడు అనుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. రవితేజ మృతితో అతని స్వగ్రామం అయిన కేశవరాయుని పాలెం గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.