తెలంగాణలోనే పెట్రోల్ పై అధిక పన్ను: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published May 22, 2022, 4:54 PM IST
Highlights

దేశంలోనే పెట్రోల్ పై అత్యధికంగా పన్నులు వసూలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 
 


 

 హైదరాబాద్: Petrol పై దేశంలోనే Telangana అత్యధికంగా పన్నులు వసూలు చేస్తోందని కేంద్ర మంత్రి Kishan Reddy చెప్పారు.ఆదివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి Hyderabad లో మీడియాతో మాట్లాడారు. పెట్రోల్ పై అన్ని రాష్ట్రాలు వ్యాట్ తగ్గించినా కూడా తెలంగాణ ప్రభుత్వం తగ్గించలేదన్నారు. KCR  ఢిల్లీ వెళ్లడం వల్లే పెట్రోల్ పై కేంద్రం పన్నులను తగ్గించిందని ప్రచారం చేయడం మాస్యాస్పదంగా ఉందన్నారు.  కొత్త విద్యా విధానం నిరుపేదల కోసమేనని కేంద్ర మంత్రి చెప్పారు. కొత్త విద్యా విదానంపై కేసీఆర్ కు అవగాహన లేదన్నారు. ఈ విద్యా విధానం పేదల కోసమేనని ఆయన చెప్పారు. కేజీ నుండి పీజీ వరకు పిల్లలకు ఉచిత విద్య అని ప్రకటించిన కేసీఆర్ ఈ విద్యా విధానాన్ని ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు.

also read:అలా చేస్తే తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ. 80లకే: బండి సంజయ్

 నెల రోజుల్లోనే తెలంగాణ ప్రభుత్వానికి రూ. 1000 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.  కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులను తగ్గించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.  పలు రాష్ట్రాలు కూడా పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులను తగ్గించాయన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల తగ్గించలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. 

కేసీఆర్ అమెరికా అధ్యక్షుడిని కూడా కలువొచ్చన్నారు. కేసీఆర్ ఎవరిని కలిసినా తమకు భయం లేదన్నారు. కేసీఆర్ ఇశాళ ఒక్కరోజే కాదు ప్రతి రోజూ Delhiకి రావొచ్చని కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు.తమకు వ్యతిరేకంగా కుట్రలు, కుతంత్రాలు కూడా చేయవద్చన్నారు. ఈ కుట్రలు, కుతంత్రాలకు తాము భయపడిపోమని కిషన్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ తాటాకు చప్పుళ్లకు భయపడబోమన్నారు.  తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో వస్తున్న అసంతృప్తి నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరిగాయన్నారు. తెలంగాణలో రైతులను ఆదుకోవాల్సిన కేసీఆర్  పంజాబ్ రైతులను ఆదుకొంటున్నారని  కేంద్ర మంత్రి తెలిపారు.రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.


 

click me!