థర్డ్ వేవ్ మీద తప్పుడు ప్రచారం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

By AN TeluguFirst Published Jun 18, 2021, 12:27 PM IST
Highlights

కరోనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మన దేశంలో జనాభా ఎక్కువ వైద్య సదుపాయాలు తక్కువ అన్నారు. యూరోప్, యూకే లాంటి దేశాలతో పోలిస్తే మన లాంటి దేశాలలో కోవిడ్ ని అడ్డుకోవాలంటే ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు కలిసి పని చేయాలన్నారు.

దీనికోసమే ఆక్సిజన్ ప్లాంట్లు, వాక్సిన్ లు, మందులు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. 15 రోజుల వ్యవధిలోనే దేశంలో ఆక్సిజన్ కొరతను కేంద్రం నిలువరించింది. గాంధీ, టైమ్స్ సహా దేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసిందని చెప్పారు.

తెలంగాణకు 1400 వెంటిలేటర్ లు 46 ఆసుపత్రులకు ఇచ్చామన్నారు. గత 74 ఏళ్లుగా 18 వేల వెంటిలేటర్ వినియోగిస్తే గత రెండు ఏళ్లలో 50 వేలకు పైగా వెంటిలేటర్ లు అందనంగా అందుబాటులోకి తెచ్చామన్నారు. 

200 కోట్ల వ్యాక్సిన్ లను భారత్ లో తయారు చేసేలా ప్రణాలికలు సిద్ధం చేశామన్నారు. భారత్ బయోటెక్ కి 1500 కోట్ల రూపాయలు వ్యాక్సిన్ కోసం  అడ్వాన్స్ ఇచ్చాం. 3వ వేవ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అనవసరం గా ప్రజలను భయపెట్టకూడదని హెచ్చరించారు.

దేశ వ్యాప్తంగా 80 కోట్ల మందికి ఒక్కొక్కరికి అదనంగా 5 కేజీల బియ్యం అందిస్తోందని తెలిపారు. ఇక తెలంగాణలో సేవభారతి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. 

click me!