విభజన సమస్యలు పరిష్కరించుకోండి.. పట్టింపులకుపోవద్దు : ఏపీ, తెలంగాణలకు కిషన్ రెడ్డి సూచన

Siva Kodati |  
Published : May 31, 2023, 04:57 PM IST
విభజన సమస్యలు పరిష్కరించుకోండి.. పట్టింపులకుపోవద్దు : ఏపీ, తెలంగాణలకు కిషన్ రెడ్డి సూచన

సారాంశం

విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూనే వున్నామని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపులకు పోవద్దని ఆయన సూచించారు. 

ఈసారి గోల్గొండ కోటలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్  రెడ్డి. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోల్కొండ కోటలో కేంద్రం తరపున వేడుకలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. గడిచిన 9 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎంతో సహకరించిందని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర సాయం ప్రజలకు వివరించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడుతూనే వున్నామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టింపులకు పోవద్దని ఆయన సూచించారు. నియోజకవర్గాల పునర్విభజన చట్టప్రకారం జరుగుతుందని కిషన్ రెడడ్ి తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు