కరోనాకి కేంద్రం సహాయంపై చర్చకు రెడీ: కేసీఆర్‌‌కి కిషన్ రెడ్డి సవాల్

By narsimha lodeFirst Published Nov 11, 2020, 5:53 PM IST
Highlights

కరోనా విషయంలో రాష్ట్రానికి కేంద్రం నుండి ఎలాంటి సహాయం చేసిందో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 

హైదరాబాద్: కరోనా విషయంలో రాష్ట్రానికి కేంద్రం నుండి ఎలాంటి సహాయం చేసిందో చర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామని 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. 

బుధవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భారీ వర్షాలతో హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలో పలు జిల్లాల్లో రైతులు ఇబ్బందులు పడ్డారన్నారు. హైద్రాబాద్ లో కేంద్ర బృందం పర్యటించడానికి తమ పార్టీ నివేదికలే కారణమన్నారు. కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి నివేదికలు ఇవ్వలేదన్నారు. 

తెలంగాణలో కేంద్ర బృందం పర్యటించడానికి తమ పార్టీ చొరవే కారణమని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కిషన్ విమర్శించారు.జీహెచ్ఎంసీలో తప్పును కప్పిపుచ్చుకొనేందుకు రూ. 10 వేలు ఇస్తున్నారన్నారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. తాను ను స్వయంగా రాష్ట్ర అధికారులను అడిగినా అధికారులు స్పష్టత ఇవ్వలేదని మంత్రి చెప్పారు.

 సీఎం కేసీఆర్ అధికారులతో రివ్యూ చేసి పంటనష్టం పై కేంద్రానికి నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు.తెలంగాణ రైతులపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన విమర్శించారు.

 గడిచిన ఆరేళ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రేటర్ ప్రజలు తివృమైన ఇబ్బందులు పడుతున్నారన్నారు. రూ. 10వేల నగదు పంపిణీలో కూడ టీఆర్ఎస్ నేతలు అవినీతికి పాల్పడుతున్నారన్నారు. 

 రైతులకు వరదలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏ సహాయం అందిస్తుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  కేంద్ర ప్రభుత్వం గ్రామ సర్పంచ్ లకు- మున్సిపాలిటీ లకు డైరెక్ట్ గా నిధులు ఇస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

టీఆరెస్ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రాంతాలను దూరం పెట్టడం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు.  మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ గా మార్చారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కు వేల కోట్లు కేంద్ర సహకారంతో నిధులు సమకూరాయన్నారు. 

కరోనాతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుండి ఆశించిన మేరకు సహాయం అందలేదని రాష్ట్ర మంత్రులు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. గత నెలలో కురిసిన వర్షాలతో నష్టపోయాం.. ఆదుకోవాలని కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాసినా కూడ కేంద్రం నుండి ఎలాంటి సహాయం అందని విషయాన్ని మంత్రి కేటీఆర్ మూడు రోజుల క్రితం ప్రకటించారు. కర్ణాటకకు సహాయం చేసి తెలంగాణకు చిల్లిగవ్వ ఇవ్వలేదని విమర్శించిన విషయం తెలిసిందే.


 

click me!