కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు లబ్ది జరగుతుందో లేదా చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు. కరోనా సమయంలో ఓటు బ్యాంకు రాజకీయాలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో తెలంగాణ ప్రజలకు లబ్ది జరగుతుందో లేదా చెప్పాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు. కేంద్రంపై కేసీఆర్ ఉపయోగించిన భాషపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ వాడిన భాషను ఆయన తప్పుబట్టారు.
మంగళవారం నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ విషయమై సీఎం కేసీఆర్ మాట్లాడిన భాషను తాను ఉపయోగించలేనని చెప్పారు.ఆ శక్తి తమకు లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ విషయంలో ఉత్త భోగస్ అంటూ కేసీఆర్ ఉపయోగించిన భాషపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ రకమైన భాషను తెలంగాణ ప్రజలు ఎవరూ కూడ ఉపయోగించరని చెప్పారు.
undefined
లాక్ డౌన్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన ప్యాకేజీ ప్రకటించిందన్నారు మంత్రి.ఎఫ్ఆర్‌బిఎం పరిమితి పెంపుకు సంస్కరణల్లో తప్పు ఏమిటని ఆయన ప్రశ్నించారు. గ్రామ పంచాయితీలు స్వయంసమృద్ధి సాధించాలని సర్పంచ్ లకు చెప్పిన తెలంగాణ సీఎం.... ప్రధాని తీసుకొస్తున్న సంస్కరణలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఎఫ్ఆర్‌బిఎం నాలుగు నిబంధనల్లో రెండింటికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒప్పుకొందన్నారు మంత్రి. తెలంగాణ ప్రభుత్వం పంటల విధానంలో మార్పులు తీసుకొన్న విధానాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
తాము సూచించిన విధంగానే పంటలను వేసిన రైతులకు మాత్రమే రైతు బంధు పథకాన్ని అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.ఈ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామా అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ విషయమై సీఎం కేసీఆర్ మాట్లాడిన భాషనను తాను ఉపయోగించలేనని చెప్పారు.
పాలనలో సంస్కరణలు రాకపోతే దేశం మరో 70 ఏళ్లైనా ఇదే రకంగా దేశం ఉండే అవకాశం ఉంటుందన్నారు. ప్రధాని ఒక్క నియమం ప్రవేశపెడితే దాన్ని విమర్శిస్తారా అని ఆయన ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అంకెల గారడి అంటూ అంతర్జాతీయ పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ విమర్శలు కేసీఆర్ తప్పుబట్టారు.
also read:ఉత్త భోగస్: ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ పై దండెత్తిన కేసీఆర్
కరోనా విషయంలో మోడీ తీరును అంతర్జాతీయ పత్రికలు, అంతర్జాతీయ సమాజం ప్రశంసించిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అడ్రస్ లేని పత్రికలు ఆర్ధిక ప్యాకేజీ గురించి రాస్తే దాన్ని పట్టుకొని కేసీఆర్ విమర్శలు గుప్పించడంపై ఆయన మండిపడ్డారు.
మూస పద్దతిలో పాలన ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం పాలనలో సంస్కరణలను తీసుకొచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామాల్లో రోడ్లు, మొక్కల పెంపకం, మిషన్ కాకతీయ పనులు నిర్వహించారా లేదా చెప్పాలని ఆయన కేసీఆర్ ను కోరారు.