జనతా కర్ఫ్యూ: కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టిన కేసీఆర్

By narsimha lodeFirst Published Mar 22, 2020, 5:14 PM IST
Highlights

కరోనాపై యుద్దంలో భాగంగా జనతా కర్ప్యూను పాటిస్తూ ఆదివారం నాడు సాయంత్రం ప్రజలు చప్పట్టు కొట్టి  తమకు సేవలు అందించినవారిని అభినందించారు.

హైదరాబాద్: కరోనాపై యుద్దంలో భాగంగా జనతా కర్ప్యూను పాటిస్తూ ఆదివారం నాడు సాయంత్రం ప్రజలు చప్పట్టు కొట్టి  తమకు సేవలు అందించినవారిని అభినందించారు.

కరోనాపై ప్రజలు స్వచ్ఛంధంగా ఆదివారం నాడు కర్ప్యూను పాటించారు. ఆదివారం నాడు ఐదు నిమిషాల పాటు చప్పట్లు కొట్టి  వైద్య సిబ్బందిని, పారిశుద్య సిబ్బందిని, పోలీసులను అభినందించాలని ప్రధానమంత్రి మోడీ కోరారు.

ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటలకు దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం సాగింది. హైద్రాబాద్ ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తన కుటుంబసభ్యులు,  అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి చప్పట్లు కొట్టి  అధికారులను అభినందించారు. 

రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తన కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు. ఇక ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో మంత్రులు, అధికారులతో కలిసి చప్పట్లు కొట్టి అధికారులను ప్రశంసించారు.
 

click me!