mmts train accident: కాచిగూడలో రెండు రైళ్ల ఢీ, 30 మందికి గాయాలు

By narsimha lodeFirst Published Nov 11, 2019, 11:19 AM IST
Highlights

హైద్రాబాద్ కాచిగూడలో రెండు రైళ్లు ఢీకొనడంతో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ప్రమాదం కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో చోటు చేసుకొంది.


హైదరాబాద్: హైద్రాబాద్‌ కాచిగూడలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు సోమవారం నాడు ఉదయం ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో రెండు రైళ్లకు చెందిన బోగీలు రైల్వే ట్రాక్‌పై నుండి  పక్కకు ఒరిగిపోయాయి. ఈ ఘటనలో పదిమందికి  గాయాలయ్యాయి.పలు రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది.

హైద్రాబాద్‌లో కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వచ్చాయి. 


హైద్రాబాద్‌లో కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు వచ్చాయి. కాచిగూడ రైల్వేస్టేషన్‌ సమీపంలో ఆగిఉన్న ప్యాసింజర్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొంది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న ఇంటర్ సిటీ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొంది.

ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. సాంకేతిక కారణాల వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొన్నట్టుగా రైల్వే అధికారులు చెబుతున్నారు.
ఎంఎంటీఎస్ రైలు స్పీడ్‌గా ఉంది. 

ఇంటర్ సిటీ రైలు కూడ అదే రైల్వే ట్రాక్‌పై వచ్చింది. ఇంటర్ సిటీ రైలును  చూసిన తర్వాత  రైలు డ్రైవర్ బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే ఎంఎంటీఎస్ రైలు మాత్రం ఆగలేదు. ఆగిఉన్న ఇంటర్ సిటీ రైలును ఢీకొంది. అయితే ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ కోచ్‌కు చెందిన మూడు కోచ్‌లు ధ్వంసమయ్యాయి.

ఈ ప్రమాదంతో రైలు పట్టాలపై కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై రైలు బోగీలు పడిపోయాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిగ్నలింగ్ లోపం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకొన్నట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు.

పక్కనే ఉన్న రైలు పట్టాలపై ఆరు బోగీలు పడిపోయాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో రెడ్ లైట్ కు బదులుగా గ్రీన్ లైట్ వెలిగినట్టుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. రైల్వే సిగ్నలింగ్ లో మానవ తప్పిదం కారణమా అనే విషయమై రైల్వే ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు.

ఈ ప్రమాదం రైల్వే స్టేషన్ కు సమీపంలో చోటు చేసుకొంది. అయితే రైల్వే స్టేషన్ కు దూరంగా జరిగితే రైలు మరింత స్పీడ్‌గా ఉండేది. అదే జరిగితే పెద్ద ప్రమాదం జరిగేది. ఉదయం పది గంటల తర్వాత ప్రమాదం జరగడం కూడ ఎంఎంటీఎస్ లో ప్రయాణీకులు తక్కువగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు. 

ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ రెండు రైల్ ఇంజన్ల మధ్య ఇరుకొన్నాడు. ఇంజిన్‌లో ఇరుక్కొన్న డ్రైవర్ ను గ్యాస్ కట్టర్ సహాయంతో వెలికితీసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారు. 

ఎంఎంటీఎస్ రైలు లింగంపల్లి నుండి  ఫలక్ నుమాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో రెండో రైల్వే ట్రాక్‌పై ఉండాల్సిన రైలు నాలుగో రైల్వే ట్రాక్ పై వెళ్లింది. అప్పటికే ఇంటర్ సిటీ రైలు నాలుగో నెంబర్ రైల్వే నెంబర్ ట్రాక్‌పై నిలిచి ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్ నుండి వెళ్లాల్సిన అన్ని రైళ్లను  అధికారులు రద్దు చేశారు. 


 

 

click me!