సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: బావిలో పడిన కారు, ఇద్దరు సురక్షితం

Published : Sep 18, 2022, 04:12 PM ISTUpdated : Sep 18, 2022, 04:52 PM IST
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం: బావిలో పడిన కారు, ఇద్దరు సురక్షితం

సారాంశం

సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం బస్తినాచారం శివారులో బావిలో కారు పడిన ఘటనలో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 


సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  బావిలో కారు పడిపోయింది. ఈ ఘటనలో  గల్లంతైన  ఒకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి మరణించినట్టుగా పోలీసులు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొండపాక మండలం బస్తినాచారం శివారులో రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో కారు పడింది.ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు.కారులో చిక్కుకుని సూరంపేటకు చెందిన యాదగిరి మృతి చెందారు. సిద్దిపేటకు చెందిన  కనకయ్య, సిర్నసగండ్లకు చెందిన వెంకటస్వామిలు సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారు.

 2021 డిసెంబర్ 1వ తేదీన సిద్దిపేట జిల్లాలోని వ్యవసాయ బావిలో కారు పడిన ఘటలో ముగ్గురు రణించారు. కారులలో ఉన్న ఇద్దరితో పాటు కారులో ఉన్నవారిని బయటకు తీసేందుకు వెళ్లిన గజ ఈతగాడు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. .సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక మండలం  చిట్టాపూర్ వద్ద  రోడ్డు పక్కన ఉన్న బావిలో కారు పడడంతో ఇద్దరు మరణించారు. కారును బయటకు తీసేందుకు వెళ్లిన గజ ఈతగాడు కూడ మరణించారు 

ఈ నెల10వ తేదీన  కామారెడ్డి జిల్లాలో వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వాగు ఉధృతిని గమనించకుండా వాగు గుండా రోడ్డును దాటే ప్రయత్నం చేయడంతో కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో కారులోని ఇద్దరిలో ఒకరిని మాత్రమే కాపాడగలిగారు.  కామారెడ్డి నుంచి రామారెడ్డి వైపు కారు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం జువ్వలపాలెం అడ్డు వంతెన వద్ద పంట కాలువలోకి కారు దూసుకెళ్లిన ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ఘటన  ఈ నెల 5వ తేదీన జరిగింది. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?