కారులో చెలరేగిన మంటలు: ఇద్దరు సజీవ దహనం

Published : Feb 20, 2019, 12:49 PM ISTUpdated : Feb 20, 2019, 01:24 PM IST
కారులో చెలరేగిన మంటలు: ఇద్దరు సజీవ దహనం

సారాంశం

సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్ద బుధవారం నాడు ఓ కారులో  మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు.మరోకరు తీవ్రంగా గాయపడ్డారు

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్ద బుధవారం నాడు ఓ కారులో  మంటలు చెలరేగడంతో ఇద్దరు సజీవ దహనమయ్యారు.మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

అవుటర్ రింగ్ రోడ్డులోని అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ వద్దకు కారు రాగానే మంటలు వ్యాపించాయి. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.

అయితే  ఈ కారులో  మంటలు వ్యాపించడానికి కారణాలు ఏమిటనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

విద్యా వ్య‌వ‌స్థ‌లో విప్ల‌వాత్మ‌క మార్పు.. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత సంస్థ‌తో తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం
హైద‌రాబాద్‌లో దారుణం.. పేక‌మేడ‌లా కూలిన ఏడంతస్తుల భవనం