మద్యానికి భార్య డబ్బులివ్వలేదని... నిప్పంటించుకుని భర్త ఆత్మహత్య

Siva Kodati |  
Published : Feb 20, 2019, 11:27 AM IST
మద్యానికి భార్య డబ్బులివ్వలేదని... నిప్పంటించుకుని భర్త ఆత్మహత్య

సారాంశం

హైదరాబాద్‌లో దారుణం జరిగింది... మద్యం తాగేందుకు భార్య డబ్బులివ్వలేదని భర్త ఒంటికి నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే... ముత్వెల్లిగూడ గ్రామానికి చెందిన నాగమ్మకు సత్యంతో 2003లో వివాహాం జరిగింది.

ఈ దంపతులకు ఇద్దరు సంతానం.. చిన్నారులిద్దరూ 14 ఏళ్ల లోపు వారే.. సత్యం రోజు వారీ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఇతను మద్యానికి బానిస కావడంతో తరచూ తప్పతాగి ఇంటికి వచ్చేవాడు.

సంపాదించినదంతా మద్యానికి ఖర్చు చేసి.. అవి చాలకపోవడంతో డబ్బుల కోసం భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం భార్యను మద్యం కోసం డబ్బులు కోసం వేధించాడు.

ఆమె అందుకు ససేమిరా అనడంతో మనస్తాపానికి గురైన సత్యం దగ్గరలో ఉన్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. నాగమ్మ మంటలను అర్పేందుకు ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆలస్యం కావడంతో తీవ్రగాయాలతో అతను ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Traffic Rules: ఫైన్ ప‌డిన వెంట‌నే బ్యాంక్ అకౌంట్ నుంచి డ‌బ్బులు క‌ట్‌.. సీఎం సంచలన ప్ర‌క‌ట‌న
Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu