నవవధువు మృతదేహాన్ని హాస్పిటల్ లోనే వదిలి... ఇద్దరు వ్యక్తులు పరార్

Arun Kumar P   | Asianet News
Published : Jul 18, 2021, 09:36 AM ISTUpdated : Jul 18, 2021, 09:40 AM IST
నవవధువు మృతదేహాన్ని హాస్పిటల్ లోనే వదిలి... ఇద్దరు వ్యక్తులు పరార్

సారాంశం

మెడలో మంగళసూత్రం, కాళ్లకు పారాణి కలిగిన  ఓ 25ఏళ్ల యువతిని అపస్మారక స్థితిలో హాస్పిటల్ కు తీసుకువచ్చి ఆమె మరణించినట్లు తెలియగానే గుట్టుచప్పుడు కాకుండా పరారయ్యారు ఇద్దరు వ్యక్తులు. 

హైదరాబాద్: అపస్మారక స్థితిలో వున్న ఓ నవవధువును హాస్పిటల్ కు తీసుకురాగా ఆమె అప్పటికే  మృతి చెందిందని డాక్టర్లు చెప్పగానే అక్కడినుండి పరారయ్యారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన హైదరాబాద్ లోని మల్లారెడ్డి హాస్పిటల్ లో చోటుచేసుకుంది. 

దుండిగల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం రాత్రి 10గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు అపస్మారక స్థితిలో వున్న 25ఏళ్ల యువతిని సూరారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ కు తీసుకువచ్చారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు తెలపడంతో ఇద్దరు వ్యక్తులు మెళ్లగా అక్కడినుండి జారుకున్నారు. ఆమె మెడలో పసుపుతాడు... కాల్లకు పారాణి ఉండటంతో నవ వధువుగా భావిస్తున్నారు. 

మృతదేహాన్ని హాస్పిటల్ లో వదిలిపెట్టి వెళ్లడంతో హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హాస్పిటల్ కు చేరుకున్న దుండిగల్ పోలీసులు మహిళ మృతదేహాన్ని పరిశీలించారు. ఆమె చేతిపై లక్ష్మి అని పచ్చబొట్టు వుండటాన్ని గుర్తించారు. అలాగే మెడలో మంగళసూత్రం వుండటంతో వివాహితగా భావిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి మార్చురీలో  భద్రపరిచారు.  

మహిళ మృతదేహాన్ని వదిలివెళ్లిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిసారు. ఇప్పటికే హాస్పిటల్ సిసి కెమెరాలను పరిశీలించగా నంబరు ప్లేటు లేని ఓ ఆటోలో ఆమెను తీసుకువచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే