ఈ లారీ వనస్థలిపురంలో ఇద్దరిని బలితీసుకుంది (వీడియో)

Published : Jan 17, 2018, 06:05 PM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
ఈ లారీ వనస్థలిపురంలో ఇద్దరిని బలితీసుకుంది (వీడియో)

సారాంశం

సంక్రాంతికి పోయి తిరగొస్తుండగా విషాదం బ్రేకులు ఫెయిల్ అయిన ఇసుక లారీ ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు వనస్థలిపురంలో సంఘటన

హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఇసుక లారీ ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. మరో ఐదుగురిని గాయపరిచింది. అందులో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ఘటన తాలూకు వివరాలిలా ఉన్నాయి.

సంక్రాంతి పండగకి వెళ్లి వస్తుండగా వనస్థలిపురం వద్ద సిగ్నల్ పడింది. అప్పుడు వారు ఆగారు. అలా ఆగడమే వారి పాలిట శాపమైంది. ఆటో నగర్ లో ఇసుక నింపుకుని ఎల్ బి నగర్ వైపు వస్తున్న ఇసుక లారీ.. వనస్థలిపురం సుష్మా థియేటర్ వద్ద సిగ్నల్ వద్దకి రాగానే బ్రేక్ లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ముందు బైక్ మీద ఉన్న ఒక వ్యక్తి మీదనుండి వచ్చి మరో బైక్ పై ఉన్న ఒకే కుటుంబానికి చెందిన బార్య భర్త ఇద్దరు పిల్లలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందగా మహిళకి తీవ్ర గాయాలయ్యాయి. అప్పటికి టిప్పర్ కంట్రోల్ కాకపోవడం తో ముందుగా ఉన్న మరో 3 ఆటో లని ఢీకొనడంతో మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

టిప్పర్ డ్రైవర్ పోలీస్ ల అదుపులో ఉన్నట్లు సమాచారం. కేస్ నమోదు  చేసుకున్న పోలీసులు మృతదేహాలని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు పోలీసులు. ప్రమాదానికి కారణమైన లారీ, గాయపడిన బాధితుల వీడియో కింద చూడొచ్చు.

PREV
click me!

Recommended Stories

KCR: కేసీఆర్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం హీట్.. హాట్ కామెంట్స్ తో రచ్చ
KCR Press Meet from Telangana Bhavan: చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు కేసీఆర్‌| Asianet News Telugu