ఖమ్మంలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

Published : Mar 25, 2023, 07:55 AM ISTUpdated : Mar 25, 2023, 07:59 AM IST
 ఖమ్మంలో రోడ్డు ప్రమాదం, ఇద్దరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..

సారాంశం

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోవ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 

ఖమ్మం : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  చర్చి కాంపౌండ్ ఫ్లై ఓవర్ మీద ప్రమాదం జరిగింది. ఓ టూవీలర్ వేగంగా వచ్చి అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొచ్చింది. దీంతో ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. మృతులను ముదిగొండ మండలం మేడిపల్లి వాసులుగా గుర్తించారు. మృతులు శివరామకృష్ణ, పగిల్ల ఉదయ్ లుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!