సూర్యాపేట కొత్త బస్టాండ్ లో పేలుడు: ముగ్గురు మృతి

Published : Feb 07, 2022, 06:10 PM ISTUpdated : Feb 07, 2022, 08:06 PM IST
సూర్యాపేట కొత్త బస్టాండ్ లో పేలుడు: ముగ్గురు మృతి

సారాంశం

సూర్యాపేట కొత్త బస్టాండ్ లో సోమవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ముగ్గురు  మరణించారు. దీంతో స్థానికులు భయాందోళనలతో పరుగులు తీశారు.

సూర్యాపేట: Suryapeta కొత్త బస్టాండ్ లో సోమవారం నాడు Blast చోటు చేసుకొంది. ఖాళీగా ఉన్న డీజీల్ ట్యాంకర్ ను వెల్డింగ్ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. పేలుడు ధాటికి డీజీల్ ట్యాంకర్  ధ్వంసమైంది. పేలుడు సమయంలో భారీ శబ్దం విన్పించింది. దీంతో బస్టాండ్ లో ప్రయాణీకులు భయాందోళనలు చెందారు. టీఎస్ 07 యూజీ 2718 అనే నెంబర్ గల డీజీల్ ట్యాంకర్ ను రిపేర్ చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. 

ఈ ప్రమాదంలో సూర్యాపేట కోట మైసమ్మ బజారుకు చెందిన వెల్డింగ్ వర్కర్ ఎం. అర్జున్, ట్యాంకర్ డ్రైవర్ గట్టు అర్జున్ అక్కడికక్కడే మరణించారు.  మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారని సమాచారం. ట్యాంకర్ వాల్వ్ లీకౌతున్న విషయాన్ని గుర్తించి సూర్యాపేట కొత్త బస్టాండ్ సమీపంలోని వెల్డింగ్ షాపు వద్ద వెల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకొంది. ఈ పేలుడు ధాటికి ట్యాంకర్ ధ్వంసమైంది. అంతేకాదు ట్యాంకర్ కు సమీపంలోని నాలుగు దుకాణాల అద్దాలు కూడా దెబ్బతిన్నాయి. విషయం తెలుసుకొన్న జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 
 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్
చైనా మంజాను ఎలా త‌యారు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. ప్రాణాలు పోయేంత ప్ర‌మాదం ఎందుకు.?