పండుగపూట విషాదం..   టపాసులు కొనేందుకు వెళ్తూ కవలలు మృతి.. చావుబతుకుల్లో తల్లీ.. 

దీపావళి పండుగ రోజు తీవ్ర విషాదం నెలకొంది.  ఓ రోడ్డు ప్రమాదంలో కవలలు మృతి చెందగా.. తీవ్రంగా గాయపడిన తల్లీ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే..?  

twins died in a accident while went for buying crackers with his mother in medak KRJ

దీపావళి పండగపూట విషాదం నెలకొంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కవలలు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తల్లి స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. చావుబతుకుల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన మెదక్ (Medak)
జిల్లా ఆటో నగర్ లో చేసుకుంది.

వివరాల్లోకెళ్తే.. మెదక్ పట్టణం ఆటోనగర్ లో అన్నపూర్ణ అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి స్కూటీపై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఓ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కవలలు పృథ్వీతేజ్ (12), ప్రణీత్ తేజ్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తల్లి అన్నపూర్ణను స్థానికులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావుబతుకుల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

Latest Videos

దీపావళి పూట అన్నపూర్ణ తన పిల్లలకు టపాసులు కొనేందుకు చిన్నారులు తల్లితో కలిసి స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి టిప్పర్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరో విషాదకర విషయమేమింటంటే.. గత రెండేళ్ల అన్నపూర్ణ భర్త శ్రీనివాస్ (హోంగార్డు) ఆయన ప్రమాదంలో మృతి చెందారు.  కవల పిల్లలు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

vuukle one pixel image
click me!