దేశ రాజకీయాలను మలుపు తిప్పేలా సీఎం కేసీఆర్ అడుగులు.. మాజీ మంత్రి తుమ్మల

By Sumanth KanukulaFirst Published Jan 15, 2023, 3:42 PM IST
Highlights

ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాల్లో మార్పుకు వేదిక కాబోతుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. 

ఖమ్మంలో ఈ నెల 18న జరిగే బీఆర్ఎస్ సభ దేశ రాజకీయాల్లో మార్పుకు వేదిక కాబోతుందని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశ రాజకీయాలను మలుపు తిప్పేలా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా క్యాంపు కార్యాలయంలో ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. దేశ ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ బీఆర్ఎస్‌ను ఏర్పాటు చేశారని అన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ సభను విజయవంతం చేస్తే.. అది దేశ వ్యాప్తంగా కలకలం అవుతుందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో అభివృద్ది జరుగుతుందని అన్నారు.  సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే 10 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. అశ్వారావుపేట అంటే ఆయిల్ పామ్ పంట సాగుకు కేరాఫ్ అడ్రస్ అన్నారు. తాత్కాలిక ప్రయోజనాలు కోసం వేరే వ్యక్తులతో మీరు వెళ్తే అది వారి కర్మ అని అన్నారు. 

click me!