హైదరాబాద్‌‌ ఎస్సైపై సస్పెన్షన్ వేటు

By Arun Kumar PFirst Published Dec 6, 2018, 4:39 PM IST
Highlights

తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన భాదితుల నుండే డబ్బులు (లంచం) స్వీకరించిన ఓ ఎస్సైని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సిపి అంజనీకుమార్ నిర్ణయయం తీసుకున్నారు. ఈ మేరకు ఎస్సై సస్పెన్షన్ కు సంబంధించిన ఉత్తర్వులను కూడా సిపి కార్యాలయం జారీ చేసింది. 

సికింద్రాబాద్ ప్రాంతంలోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్లో గణేష్ ఎస్సైగా పనిచేసేవాడు. అయితే ఓ కేసులో బాధితులుగా వున్నవారిని బెదిరించినట్లు ఇతడిపై ఆరోపణలున్నాయి.. కేవలం బెదిరించడమే కాకుండా వారి నుండి డబ్బులు స్వీకరించాడు. దీంతో ఎస్సై తమ పట్ల వ్యవహరించిన తీరును బాధితులు సిపి దృష్టికి తీసుకెళ్లారు. లిఖిత పూర్వకంగా ఎస్సైపై ఫిర్యాదు కూడా చేశారు. 

దీనిపై విచారణ చేయించిన సిపి ఎస్సై బాధితుల నుండి లంచం తీసుకున్నట్లు నిర్దారణ అయ్యింది. దీంతో వెంటనే అతన్ని విధుల నుండి సస్పెండ్ చేస్తూ అంజనీ కుమార్ చర్యలు తీసుకున్నారు. 

click me!