ఆ డబ్బు బయట దొరికింది, నాకు సంబంధం లేదు:జూపూడి

By Nagaraju TFirst Published Dec 6, 2018, 4:22 PM IST
Highlights

ఇంటి బయట దొరికిన డబ్బులతో తనకు సంబంధం ఏంటని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. జూపూడి నివాసంలో డబ్బులు దొరికాయంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు.  
 

హైదరాబాద్: ఇంటి బయట దొరికిన డబ్బులతో తనకు సంబంధం ఏంటని ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. జూపూడి నివాసంలో డబ్బులు దొరికాయంటూ వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు.  

మహాకూటమి విజయంలో తనవంతు పాత్ర పోషించేందుకు వచ్చానే తప్ప డబ్బులు పంపిణీ చెయ్యడానికి కాదన్నారు. వైసీపీ, టీఆర్ఎస్, పోలీసులు తన ఇంట్లో సోదాలు నిర్వహించారని మండిపడ్డారు. రాత్రి తన నివాసంలో నాలుగు సార్లు సోదాలు చేశారని అయినా ఏమీ దొరకలేదన్నారు. 

బయట దొరికిన డబ్బులతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితులు అంటే లెక్కలేకుండా పోయిందని మండిపడ్డారు. మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వండంటూ కోరారు. 

బుధవారం ఉదయం నుంచి తనను పోలీసులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాలో అవుతున్నారని తెలిపారు. వారి పార్టీ వారికి ముఖ్యం అయితే మా పార్టీ మాకు ముఖ్యం కాదా అంటూ  ప్రశ్నించారు. దాడుల పేరుతో తన ఇల్లు ధ్వంసం చేయాలని ప్రయత్నించారని తెలిపారు. నాపేరు ప్రతిష్టలకు భంగం కలిగించారని మండిపడ్డారు. వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.  

అయితే బుధవారం రాత్రి కూకట్ పల్లి బాలాజీ నగర్ లో ఆంధ్రప్రదేశ్ ఎస్సి కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ  నేపథ్యంలో జూపూడి ఇంటి వెనుక నుండి డబ్బు మూటలతో పారిపోతున్న ఇద్దరు వ్యక్తులను టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. పారిపోతున్న వారి నుంచి పోలీసులు 17.50 లక్షల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. జూపూడి ఇంటిదగ్గర డబ్బులు దొరకడం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 

ఈ వార్తలు కూడా చదవండి

జూపూడి ఇంట్లో పోలీసుల తనిఖీలు, డబ్బు సంచులతో పారిపోతున్న వ్యక్తి అరెస్ట్ (వీడియో)

click me!