గవర్నర్ వద్దే టిడిపి తాడో పేడో (వీడియో)

Published : Jan 12, 2018, 06:05 PM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
గవర్నర్ వద్దే టిడిపి తాడో పేడో (వీడియో)

సారాంశం

ఒంటేరు ప్రతాప్ రెడ్డి అరెస్టుపై టిడిపి ఆగ్రహం ప్రగతిభవన్ ముట్టడికి యత్నం.. భారీగా అరెస్టులు సిటీ లీడర్లను ఇండ్ల వద్దే అరెస్టు చేసిన పోలీసులు రేపు మధ్యాహ్నం గవర్నర్ అపాయింట్ మెంట్

తెలంగాణ టిడిపి పోరుబాట పట్టింది. సిఎం కేసిఆర్ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడి చేపట్టింది. భారీగా నాయకులు, కార్యకర్తలు ప్రగతిభవన్ వద్ద ఆందోళనకు దిగి అరెస్టయ్యారు. కొందరిని ఇంటి వద్దే ఉదయం నుంచి పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగించారు. అరెస్టయిన వారందరినీ గోషామహల్ స్టేడియం తరలించారు. ఒంటేరు ప్రతాపరెడ్డిని విడుదల చేసే వరకు గోషామహల్ స్టేడియం నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ అంతటా అన్ని పోలీసు స్టేషన్లలోనే నాయకులు, కార్యకర్తలందరం బైటాయించి ఆందోళన చేస్తామన్నారు.

అయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఒంటేరు ప్రతాపరెడ్డి అరెస్టు విషయంలో గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే ఒంటేరు అరెస్టు పంచాయతీ గవర్నర్ వద్దే తేల్చుకోవాలని టిడిపి తెలంగాణ నేతలు డిసైడ్ అయ్యారు. ఇక గవర్నర్ తో సమావేశం అవుతున్న తరుణంలో తమ ఆందోళనను ప్రస్తుతానికి విరమించారు టిడిపి నేతలు. ఒంటేరు ప్రతాపరెడ్డి అరెస్టు విషయంలో ఆలస్యంగానే స్పందించినప్పటికీ తెలంగాణ తెలుగు దేశం పార్టీ పంచాయతీ మాత్రం గవర్నర్ వద్దకు తీసుకుపోయగలిగింది. టిడిపి తెలంగాణ అధ్యక్షులు రమణ మాట్లాడిన వీడియో కింద చూడండి.

PREV
click me!

Recommended Stories

Panchayat Elections : తెలంగాణ పంచాయతీ ఎన్నికలు.. మూడో దశలోనూ కాంగ్రెస్ హవా
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే