అధికారం తమదేనంటూ గప్పాలు కాదు.. ముందు సీఎం అభ్యర్థిని డిక్లేర్ చేయండి: కాంగ్రెస్ పై TSREDCO సతీష్ రెడ్డి ఫైర్

By Mahesh Rajamoni  |  First Published Sep 14, 2023, 4:05 PM IST

Hyderabad: తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి కాంగ్రెస్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. "అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణను ఎండబెట్టి, ఈ ప్రాంతాన్ని దోచుకున్నారు. ఇప్పుడు కూడా ఓ అవినీతి పరుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టి మరోసారి దోపిడీకి తెర తీస్తున్నారని భావించాల్సి ఉంటుంది. అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారి పార్టీ పేరునే 'స్కాంగ్రెస్' గా మార్చుకున్న మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. ఇప్పటికైనా డిక్లరేషన్ జిమ్మిక్కులు ఆపి  తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పండి'' అంటూ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.


Telangana REDCO Chairman Y Sathish Reddy: అధికారం తమదేనంటూ గప్పాలు గొడుతున్న కాంగ్రెస్.. తమ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో మొదట సీఎం డిక్లరేషన్ చేయాలనీ, ఆ తర్వాతే ఇతర అంశాలపై చర్చించుకోవాలని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి విమ‌ర్శించారు. అలాగే,  ''కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాల కోసం 39 మంది సభ్యులు, పార్టీకి చెందిన ఇతర జాతీయ నేతలు తెలంగాణు వస్తున్నారు. మీకు తెలంగాణ సీఎం అభ్యర్థిని డిక్లేర్ చేసే దమ్ముందా..? మీరు ఇప్పటి దాకా చేసిన డిక్లరేషన్లు అమలు చేసే వ్యక్తి ఎవరో కూడా తెలంగాణ ప్రజలకు తెలియాలి కదా. ఆ వ్యక్తి లంగనో, దొంగనో.. ప్రజలు తెలుసుకోవాలి కదా. ఎందుకంటే ఢిల్లీ నుంచి వస్తున్న AICC, CWC సభ్యులంతా స్కాముల్లో, అవినీతిలో నిండా కూరుకుపోయిన వ్యక్తులేనంటూ'' ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు, చివరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ కూడా పెద్ద అవినీతిపరుడనీ  బ్లాక్ మెయిలర్ అని ఆరోపించారు. ''మరి మీ సీఎం అభ్యర్థి ఎలాంటోడు అనేది ప్రజలకు తెలియాలి కదా. అందుకే మీరు ఎన్ని డిక్లరేషన్లు చేసినా ఉపయోగం లేదు. మొదట సీఎం డిక్లరేషన్ చేయండి'' అని పేర్కొన్నారు. ''మేం గర్వంగా చెబుతున్నాం.. మా సీఎం అభ్యర్థి కేసీఆర్ అని. ఆయన చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఆయన మనస్తత్వం ఏంటో.. తమకోసం ఎలా కష్టపడుతున్నారో కూడా ప్రజలు చూస్తున్నారు. ప్రపంచం కూడా గుర్తించి హర్షిస్తున్నది. అభినందిస్తున్నది. మరీ మీ సీఎం అభ్యర్థి పనిమంతుడో, పనిమంతురాలో కూడా తెలంగాణ సమాజం తెలుసుకోవాలి కదా. మీ పార్టీలో మా కేసీఆర్ గారిని మించిన వాళ్లు ఉన్నారా..? అనేది కూడా ప్రజలకు తెలియాలి కదా'' అని ఫైర్ అయ్యారు.

Latest Videos

''బీసీ డిక్లరేషన్, అని ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు, రైతు డిక్లరేషన్ అని ఇలా నోటికొచ్చిన స్కీములన్నీ ప్రకటిస్తున్నారు సరే. మరి వాటిని అమలు చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారనేది ప్రజలకు మొదటి చెప్పాలి. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టు బలిదేవత సోనియాగాంధీ ఈ బాధ్యత తీసుకుంటారా.? లేకపోతే ముద్దపప్పు రాహుల్ గాంధీ తీసుకుంటారా.? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మా బిడ్డలను బలి తీసుకున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ల పేరుతో మరోసారి మోసం చేసి మా తెలంగాణ ప్రజలను బలితీసుకుందామని  కుట్రలు పన్నుతున్నారా.? ఇప్పటికీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదు అంటే.. ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలా మీకు జీ హుజూర్ అనే పనికిమాలినోళ్లే ఉంటారనిపిస్తోందని'' ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

click me!