నిరుద్యోగులకు శుభవార్త... 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Siva Kodati |  
Published : Dec 29, 2022, 07:51 PM ISTUpdated : Dec 29, 2022, 07:56 PM IST
నిరుద్యోగులకు శుభవార్త... 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సారాంశం

తెలంగాణలో 783  గ్రూప్ 2 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ.  అటు పోలీస్ శాఖలోనూ రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 

తెలంగాణలో గ్రూప్ 2 పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసింది టీఎస్‌పీఎస్సీ. 783 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జనవరి 18 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్ 4 నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. హార్టికల్చర్, వెటర్నరీ శాఖల్లో కూడా కొలువులు భర్తీకి ప్రకటనలు వెలువడ్డాయి. అటు పోలీస్ శాఖలోనూ రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి కూడా నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే.. డిసెంబర్ 9న  1,392 లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. 2008లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 1100 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి నోటిఫికేషన్‌గా నిలిచింది. అర్హులైన అభ్యర్ధులు ఈ నెల 16 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 

Also REad: జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారి

ఇకపోతే.. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా వున్న 1147 పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 20న ఉదయం 10.30 గంటల నుంచి జనవరి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపింది. మొత్తం 34 విభాగాల్లో 1147 పోస్టులను భర్తీ చేస్తామని పేర్కొంది. అనస్థీషియాలో 155, జనరల్ సర్జరీలో 117, జనరల్ మెడిసిన్‌లో 111 తదితర విభాగాల్లో అత్యధిక ఖాళీలు వున్నాయి.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?