TS Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయ్!.. 15750 మందితో జాబితా.. 

Published : Oct 04, 2023, 10:24 PM ISTUpdated : Oct 04, 2023, 11:15 PM IST
TS Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలు వచ్చేశాయ్!.. 15750 మందితో జాబితా.. 

సారాంశం

TS Constable Results: తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామక పరీక్షలకు సంబంధించిన తుది ఫలితాలను బుధవారం ప్రకటించింది. 

TS Constable Results:  ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న తెలంగాణ కానిస్టేబుల్‌ తుది ఫలితాలు విడుదల అయ్యాయి. తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బుధవారం సాయంత్రం కానిస్టేబుల్ తుది ఫలితాలను వెల్లడించింది. మొత్తంగా 15,750 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల జాబితా ను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు  https://www.tslprb.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయని  తెలంగాణ స్టేట్‌ లెవెల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు పేర్కొంది.

మొత్తం 15,750 మంది పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా.. అందులో 12,866 మంది పురుషులు, 2,884 మంది మహిళా అభ్యర్థులున్నారు. రాష్ట్రంలో ఖాళీగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. స్పెషల్ పోలీస్, సివిల్ పోలీస్, ఏఆర్ తదితర విభాగాల్లో పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ స్వీకరించి.. విడతల వారీగా పరీక్షలు నిర్వహించింది.

అయితే, పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు అగ్నిమాపకశాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం త్వరలో వెల్లడిస్తామని బోర్డు ప్రకటించింది. ఈ పోస్టులకు సంబంధించిన కేసులు కోర్టులో కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఇదిలా ఉంటే..రాష్ట్రంలో ఖాళీగా కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ గతేడాది నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30న కానిస్టేబుల్ తుది రాత పరీక్షలు నిర్వహించారు. ఇందులో  సివిల్ కానిస్టేబుల్ పరీక్షలకు మొత్తం 1,09,663 మంది అర్హత సాధించగా.. వారిలో 1,08,055 మంది పరీక్షకు హాజరయ్యారని బోర్డు తెలిపింది. మొత్తం 98.53 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు బోర్డు తెలిపింది. 

PREV
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్