
తెలంగాణ ఐసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ వీసీ రమేష్ ఐసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఐసెట్-2022లో 61,613 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఐసెట్-2022లో గుంటూరు జిల్లాకు చెందిన దంతాల పూజిత్ వర్థన్‌కు మొదటి ర్యాంక్, కడప జిల్లాకు చెందిన అంబవరం ఉమేశ్‌చంద్ర రెడ్డికి రెండో ర్యాంక్ సాధించారు. ఐసెట్ ఫలితాలను అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ ర్యాంక్ కార్డు మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అనంతరం ఐసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ఫలితాలను చూసుకోవచ్చు. ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చు.
ఇక, ఈ సారి ఐసెట్‌ను కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించింది. ప్రవేశ పరీక్షను జులై 27, 28 తేదీల్లో నాలుగు సెషన్లలో నిర్వహించారు. తెలంగాణతో పాటు ఏపీలో కూడా పలు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. టీఎస్ ఐసెట్-2022కు 75,952 మంది దరఖాస్తు చేసుకోగా.. 68,781 మంది హాజరుకాగా, 7171 మంది పరీక్షకు గైర్హాజరయ్యారు. అయితే ఈ నెల 22నే ఐసెట్-2022 ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ.. సాంకేతిక కారణాలతో ఫలితాల విడుదల నేటికి వాయిదా పడింది.