
తెలంగాణలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడి ఎంట్రన్స్ పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్ విడుదలైంది. వాయిదా పడిన ఎంసెట్ అగ్రికల్చర్, ఈ సెట్ పరీక్షల రీషెడ్యూల్ తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను ఈ నెల 30,31 తేదీల్లో నిర్వహించనున్నట్టుగా తెలిపింది. ఆగస్టు 1వ తేదీన ఈ సెట్ పరీక్షను నిర్వహించనున్నట్టుగా పేర్కొంది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు
గత వారం తెలంగాణలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో.. జూలై 13 జరగాల్సిన ఈ-సెట్ పరీక్ష వాయిదాను వాయిదా వేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. అయితే ఎంసెట్ ఎగ్జాట్ మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని వెల్లడించింది. అయితే రాష్ట్రంలో వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో.. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జూలై 14,15 తేదీల్లో జరగాల్సి ఉన్న ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా తెలిపింది.
అదే సమయంలో జూలై 18,19,20 తేదీల్లో జరగనున్న ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష యథావిథిగా కొనసాగనుందని ఉన్నత విద్యామండలి పేర్కొంది. దీంతో సోమవారం (జూలై 18) నుంచి రాష్ట్రంలో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష కొనసాగుతుంది. రేపటితో ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష ముగియనుంది.