తెలంగాణ ఫలితాలు: కారును బోల్తా కొట్టించిన ట్రక్కు

By Arun Kumar PFirst Published Dec 12, 2018, 1:53 PM IST
Highlights

గత రెండు రెండు మూడు నెలలుగా తెలంగాణలో సాగుతున్న ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. ఈ ఎన్నికల్లో హస్తాన్ని నలిపెస్తూ కారు శరవేగంతో దూసుకుపోయింది. ఆ వేగం 2014ల్లో సెంటిమెంట్ అధికంగా వున్న సమయం కంటే ఎక్కువగా వుంది. అన్ని నియోజకవర్గాల్లో కారు జోరుకు అడ్డు లేకుండా దూసుకుపోతే... కొన్ని చోట్ల మాత్రం ఓ ట్రక్కు ఆ కారును అడ్డుకుంది. ఇలా రెండు మూడు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ట్రక్కు గుర్తు శాసించిందని నిన్నటి ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. 
 
ఈ ఎన్నికల్లో కొన్ని నియోజవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పోలిన గుర్తు ఎన్నికల సంఘం సమాజ్ వాది ఫార్వర్డ్ బ్లాక్ కు కేటాయించింది. ఇదే ఓటర్లను గందరగోళానికి గురిచేసింది. పోలింగ్ సమయంలో చాలామంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్దులు కారుకు ఓటేయబోయి ట్రక్కుకు ఓటేసినట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా స్వల్ప తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమిపాలైన కొన్ని నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తుకు అధికంగా ఓట్లు పడ్డాయి. ఇదే తమ ఓటమికి కారణమైందని అభ్యర్థులు కూడా భహిరంగంగా వెల్లడిస్తున్నారు. 

నకిరేకల్ నియోజకవర్గంలో ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంపై కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య గెలిచారు. వీరేశం, లింగయ్యల మధ్య ఓట్ల తేడా కేవలం 8 వేలు మాత్రమే. అయితే ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ నుండి పోటీచేసిన రవికుమార్ అనే అభ్యర్తికి 10 వేల ఓట్లు పోలయ్యాయి. ఆ పార్టీకి కేటాయింయిన  ట్రక్కు గుర్తు వల్లే వీరేశం ఓటమిపాలయ్యాడని ఓ ప్రచారం జరుగుతోంది. 

టిపిసిసి అధ్యక్షుడి గెలుపుకు కూడా ఈ ట్రక్కు గుర్తే కారణమంటూ హుజుర్ నగర్ టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఉత్తమ్ శిఖండిలా మారి కారు గుర్తులా ఉండే ట్రక్కు గుర్తును అడ్డుపెట్టుకొని విజయం సాధించాడని సైదిరెడ్డి విమర్శించారు. అచ్చు కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు వల్లే తన కు పడాల్సిన ఓట్లు పార్వర్డ్ బ్యాక్ పార్టీకి పడి మధ్యలో ఉత్తమ్ గెలుపొందాడని సైదిరెడ్డి వివరించారు.

 నకిరేకల్, హుజూర్ నగర్లోనే కాదు మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ట్రక్కు గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థుల మెజారిటీని తగ్గించింది. మానుకొండూరులో 13610, దుబ్బాకలో 12215, జనగామలో 10,031, కామారెడ్డిలో 10,537  నాగార్జునసాగర్ లో 9800 ఓట్లు ట్రక్కు గుర్తు కల్గిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులకు వచ్చాయి. దీని వల్లే ఆయా నియోజవర్గాల్లో టీఆర్ఎస్ ఆధిక్యం తగ్గిందని తెసుస్తోంది. ఈ పార్టీ తరపున ఫోటీ చేసిన అనామక అభ్యర్థులు కూడా వేలల్లో ఓట్లు సాధించడమే ఈ అనుమానానికి కారణమవుతోంది. 

click me!